బుల్లితెర నటి శ్రీవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక సీరియల్స్ లో తనదైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా దగ్గరైంది. శ్రీవాణికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై అనేక సీరియల్స్ లో రాణిస్తూనే వెండితెరపై కూడా మెరిసింది. ఓవైపు సీరియల్స్ తో బిజీబిజీగా ఉండే శ్రీవాణి కొద్ది కాలం క్రితం స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో తన గురించి, తన కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అలా తన రోజూ వారీ లైఫ్ స్టైల్, షూటింగ్ అప్ డేట్స్.. వంటి అనేక వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను అలరిస్తుంటుంది. తాజాగా తన కొత్త ఇంటి గృహప్రవేశ వేడుకకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ గృహ ప్రవేశాన్ని పలువురు బుల్లితెర నటీనటులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాల వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు.. యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి.. వాటి ద్వారా తమకు సంబంధించిన వీడియోలను అభిమానులకు షేర్ చేస్తున్నారు. ఇలా వెండితెర, బుల్లితెర నటీనటులు చాలా మంది తమ వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుని ఫాలోవర్లను అలరిస్తుంటారు. బుల్లితెర నటీమణులు చాలా మంది తమ షూటింగ్ వీడియోలను, ఇతర వ్యక్తిగత విషయాలను వీడియోల రూపంలో అభిమానులతో పంచుకుంటున్నారు. అలా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి.. ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో బుల్లితెర నటి శ్రీవాణి ఒకరు. ఇటీవలే ఆమె కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. గృహప్రవేశ వేడుకను శ్రీవాణి ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు బుల్లితెర నటీనటులు హాజరయ్యారు. భర్త విక్రమాదిత్య, కుమార్తెతో కలిసి శ్రీవాణి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
అంతే కాక శ్రీవాణి వంటగదిలో పాలు పొంగిచి దేవుడి నమష్కరించారు. గృహప్రవేశ పూజా కార్యక్రమాల్లో హిమజ, జబర్దస్త్ ఫేమ్ పవిత్రతో పాటు పలువురు నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీవాణికి అందరు శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరు బుల్లితెర నటీనటులు సోషల్ మీడియా ద్వారా శ్రీవాణికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవలే శ్రీవాణి..తన కుమార్తె ఓణీల వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా తన కొత్త ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి.