తెలుగు బుల్లితెరపై పాపులర్ అయిన ఎంటర్టైన్ మెంట్ షోలలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. సుమారు రెండేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షోకి.. జబర్దస్త్ తో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొద్దికాలంలోనే యూనిక్ కంటెంట్, కాన్సెప్ట్ లతో క్రేజ్ సంపాదించుకున్న ఈ షో.. ప్రతి ఆదివారం ప్రసారం అవుతుంది. యాంకర్ రష్మీ హోస్ట్ చేస్తున్న ఈ షోకి ప్రెజెంట్ నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తోంది. కాగా.. ఎప్పటిలాగే రాబోయే వారానికి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. అయితే.. వీకెండ్ లో న్యూ ఇయర్ వస్తుండటంతో స్పెషల్ కాన్సెప్ట్ తో ఎపిసోడ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ క్రమంలో లేటెస్ట్ ప్రోమో చివరివరకు సరదాగానే సాగినప్పటికీ, క్లైమాక్స్ లో ఎమోషనల్ మూమెంట్స్ కూడా చోటుచేసుకున్నాయి. పంచ్ ప్రసాద్ ఫస్ట్ టైమ్ తన చిన్ననాటి ఫ్యామిలీ ఫోటోని అందరికీ చూపిస్తూ.. ఫ్యామిలీ గురించి చెప్పాడు. ప్రసాద్ మాట్లాడుతూ.. ‘మా ఫ్యామిలీలో అమ్మానాన్నతో పాటు నాకు ఓ అక్క, అన్న ఉండేవారు. మా అన్న కూడా థియేటర్ ఆర్టిస్ట్ ఆయన్ని చూసే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. కానీ.. ఇప్పుడు మా ఫ్యామిలీలో నాన్న, అన్న, అక్క ముగ్గురు చనిపోయారు. ప్రస్తుతం నేను, అమ్మ మాత్రమే మిగిలి ఉన్నాం’ అని చెబుతూ ఏడ్చేశాడు. దీంతో ప్రసాద్ ఫ్యామిలీ గురించి తెలిసి షోలో ఉన్నవారంతా భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. మరి ప్రసాద్ ఫ్యామిలీ గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.