ఇటీవల కాలంలో కోలీవుడ్ బుల్లితెర అత్యంత చర్చనీయాంశంగా మారిన టాపిక్ సెవ్వంతి సీరియల్ నటి దివ్య- ఆర్నవ్. 2017లో ఓ సీరియల్ షూటింగ్‌లో పరిచయం అయిన ఇద్దరు ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. అయితే దివ్య కడుపుతో ఉన్న దగ్గర నుండి వీరిద్దరీ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
ఇటీవల కాలంలో కోలీవుడ్ బుల్లితెరకు సంబంధించి అత్యంత చర్చనీయాంశంగా మారిన టాపిక్ సెవ్వంతి సీరియల్ నటి దివ్య శ్రీధర్ – ఆర్నవ్ గొడవ. 2017లో ఓ సీరియల్ షూటింగ్‌లో పరిచయం అయిన ఇద్దరు ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. అయితే దివ్య కడుపుతో ఉన్న దగ్గర నుండి వీరిద్దరీ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఆమెకు గతంలో పెళ్లి అయ్యి, పాప ఉన్న విషయాన్ని దాచి పెట్టిందని ఆర్నవ్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో అతడు మరో నటితో సంబంధం పెట్టుకోవడంతో భరించలేక నిలదీయడానికి వెళ్లిన తనపై ఆర్నవ్ ఎటాక్ చేశాడంటూ అతడిపై గత ఏడాది పోలీసులకు కేసు పెట్టింది.
పోలీసులు అతడ్ని అరెస్టు చేయగా.. బెయిల్‍పై విడుదలయ్యాడు. అప్పటి నుండి ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ వివాదం ఇటీవల పలు మలుపులు తీసుకుంది. వీరికి ఇప్పుడు ఓ పాప పుట్టింది. బెయిల్‌పై విడుదల అయిన ఆర్నవ్ తన మనుషులు, లాయర్లతో వచ్చి గొడవ పడ్డాడని దివ్య సంచలన ఆరోపణ చేసింది. అర్దరాత్రి ఒక్కసారిగా 15 మందితో తన ఇంటి తలుపు తట్టాడని తెలిపింది. వారందరూ తనను తోసుకుంటూ ఇంట్లోకి చొరబడ్డారని చెప్పుకొచ్చింది. గతంలో కూడా అతడికి అనేక మంది అమ్మాయిలతో ఎఫైర్ ఉందని పేర్కొంది. అయితే ఇప్పుడు తనకు, పాపకు ప్రాణ హాని ఉందని, తమకు రక్షణ కల్పించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను అభ్యర్థించింది.
‘ప్రస్తుతం ఆర్నవ్ షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నాడు. ఈ సమయంలో అతను నా ఇంటికి రాకూడదు. నన్ను బెదిరించి, నా పాపను చంపడానికి ప్రయత్నించాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానో అతనికి అన్నీ తెలుసు.. అందుకోసం ఒక వ్యక్తిని గూఢచారిగా పెట్టుకున్నాడు. ఎప్పటికైనా నన్ను చంపేస్తాడు. నా ఇంట్లో ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వచ్చి బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఆయనపై చర్యలు తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను’ అని దివ్య కన్నీరు పెట్టుకుంది.