వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులో ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో ‘బిగ్ బాస్ 7’ వ సీజన్‌కి సిద్ధమవుతోంది.
వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులో ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో ‘బిగ్ బాస్ 7’ వ సీజన్‌కి సిద్ధమవుతోంది. లోగో రిలీజ్ తర్వాత హెస్ట్ గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ.. కింగ్ నాగార్జునకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. నాగ్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అదరగొట్టేశాడు. కింగ్ చేతిలో పాప్ కార్న్ డబ్బా పట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ.. ‘ఈసారి సీజన్ గురించి ఏం చెప్పాలి?.. చాలా కొత్తగా.. ప్రతిసారి ఇదే కదా చెప్పేది (గొణుకుతూ) ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అని పాడుతూ చిటిక వేయగానే.. అక్కడ ఉన్న వస్తువులన్నీ గాల్లో చెల్లాచెదురుగా ఎగిరిపోతున్నాయి. ప్రోమో చూస్తుంటే ఈ సీజన్లో మేకర్స్ చాలా కొత్తగా వెరైటీగా ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.
ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, అసలు ఈ ‘కుడి ఎడమైతే’ కాన్సెప్ట్ ఏంటి? అనే విషయం గురించి ఆడియన్స్, బిగ్ బాస్ లవర్స్ తెగ డిస్కస్ చేస్తున్నారు. దీని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు, మరికొన్ని వివరణలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అక్టోబర్‌లో వరల్డ్ కప్ సీజన్ స్టార్ట్ కాబోతుండడంతో ఈ సీజన్ కాస్త ముందుగానే ప్రారంభించబోతున్నారు. ఇక ప్రోమో క్యాప్షన్‌లో.. ‘మీకు తెలిసింది, ఇంతకుముందు జరిగింది, మీరనుకునేది కాకుండా టోటల్‌గా అంతా మార్చబోతున్నాం. దాన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యడానికి రెడీగా ఉండండి’ అంటూ ‘కుడి ఎడమైతే’ ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో హింట్ ఇచ్చారు. అలాగే ఈసారి హౌస్ కూడా కంప్లీట్ డిఫరెంట్‌గా ఉండబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్ అనగానే జనాలు ఒక ఫార్మాట్‌కి ఫిక్స్ అయిపోయారు. ఒక యూట్యూబర్, ఛానెల్ నుంచి ఒకరు, ఫేడౌట్ అయిపోయిన హీరో ఒకడుండాలే.. అని డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఈ సీజన్లో అలాంటి రొటీన్ ఫార్మాట్ పక్కన పెట్టేసి, జనాలకు తెలిసిన వాళ్లని, యాక్టివ్‌గా ఉన్న వాళ్లని, బాగా కామెడీ చేసే వాళ్లని, అలాగే ఇతర భాష, స్టేట్ నుండి కూడా కొంతమందిని తీసుకోవచ్చు అని కూడా అనిపిస్తుంది. అలాగే.. ఏ రోజు ఏ టాస్క్ ఉంటుందనేది కూడా అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈ సెవెన్త్ సీజన్ గత సీజన్లన్నిటికీ భిన్నంగా ఉండబోతుందనిపిస్తుంది. ఈ సీజన్ సూపర్ డూపర్ హిట్ అవుతుందంటూ ప్రోమో ద్వారా చెప్పకనే చెప్పారు ‘బిగ్ బాస్’ టీం అంటూ నెటిజన్లను కామెంట్స్ చేస్తున్నారు.