బిగ్ బాస్ షోలో పాల్గొని బయటకొచ్చిన వారికి కాస్తో కూస్తో గుర్తింపు లభిస్తుంది. సోషల్ మీడియాలో మోస్తరు కంటే ఎక్కువగానే క్రేజ్ ఏర్పడుతుంది. దీంతో రియాలిటీ-ఎంటర్ టైన్ మెంట్ షోలు, సినిమాలు చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో యూట్యూబ్, ఇన్ స్టాలోనూ తమకు సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక సొంతంగా ఛానెల్ పెట్టడమే కాకుండా.. హోమ్ టూర్స్ దగ్గర నుంచి కొత్తగా ఏ వస్తువు కొన్నా సరే ఆ విషయాన్ని నెటిజన్స్, తమ ఫాలోవర్స్ కి చెప్పి మురిసిపోతుంటారు. ఇప్పుడు నటి, యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ‘బిగ్ బాస్’తో ఫేమ్ తెచ్చుకున్న హిమజ కూడా కొత్తగా లగ్జరీ కారు కొనుగోలు చేసింది.
ఇక విషయానికొస్తే.. తెలుగులో బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. అందులో మూడో సీజన్ లో పార్టిసిపేట్ చేసిన లేడీ కంటెస్టెంట్స్ బాగా ఫేమస్ అయ్యారు. వారిలో శివజ్యోతి, హిమజ, అషూరెడ్డి, రోహిణి తదితరులు ఉన్నారు. వీరిలో శివజ్యోతి.. ఇల్లు, కారు కొనేసింది. హిమజ కూడా ఆల్రెడీ తన డ్రీమ్ హౌస్ కట్టే పనిలో ఉంది. ఇప్పటికే ఓ కారు సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో కాస్ట్ లీ కారు కొన్నట్లు చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అయితే సంక్రాంతి స్పెషల్ గా ఈ కారుని తన కుటుంబం కోసం కొన్నట్లు రాసుకొచ్చింది.
‘హ్యాపీ సంక్రాంతి.. ఈ సంక్రాంతికి నా ఫ్యామిలీనీ ఇలా సర్ ప్రైజ్ చేశాను. వారి ఆనందమే నాకు ముఖ్యం. మీ అందరి ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యమైంది’ అని హిమజ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఇలా తన అభిమానులపై ప్రేమ కురిపించింది. అయితే హిమజ ఇప్పటికే పెళ్లి చేసేసుకుందని రూమర్స్ వినిపించాయి. కానీ తనకు అలాంటిది ఏం జరగలేదని ఆమె చెప్పుకొచ్చింది. అలానే ఆమె కొన్న ఇల్లు, కారు లాంటి వీడియోలపైనా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఇదంతా తన కష్టార్జితం అని, ఎవరూ తనకు ఫ్రీగా ఇవ్వలేదని ఆమె అప్పట్లోనే గట్టి కౌంటర్స్ వేసింది. ఇదిలా ఉండగా ఈ కారు ధర రూ.35 లక్షలకు పైన ఉన్నట్లు తెలుస్తోంది. మరి హిమజ కొత్త కారు వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.