ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తెలుగు బుల్లితెరపై అనేక షో లు ప్రసారమవుతున్నాయి. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతిరత్నాలు, కామెడీ స్టార్స్ వంటి కామెడీ షోలు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అంతేకాక ప్రతి పండగకి ఓ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తుంటారు. ఇప్పటి వరకు సంక్రాంతి, వినాయక చవితి, దీపావళి వంటి పండగలకు స్పెషల్ ఈవెంట్స్ చాలా వచ్చి.. ఫుల్ ఎంటర్ టైన్ చేశాయి. తాజాగా దసరా పండగ సందర్భంగా ‘నవరాత్రి ధమాకా’ పేరుతో ఓ కార్యక్రమం రానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ప్రోమో మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి తన తండ్రిని తలచుకుని కన్నీటి పర్యతం అవుతోంది.
ప్రోమోలో దసరా సందర్భంగా ‘నవరాత్రి ధమకా’ వేడుకలు హైదరాబాద్ లో నిర్వహించాలని ఒకరంటే, కాదు.. విజయవాడలో నిర్వహించాలని మరొకరు అంటారు. మధ్యలో పరిష్కారం కోసం యాంకర్ రవి, హైబర్ ఆది వస్తారు. వారిద్దరు ఒకరిపై మరొకరు పంచ్ లు వేసుకున్నారు. ఇదే సమయంలో ఆది మిగిలి కమెడీయన్లపై కూడా పంచ్ లు వేసి ఫుల్ కామెడీ పండిస్తాడు. అలనాటి అందాల తారలు ప్రేమ, సంఘవి కూడా షోలో పాల్గొన్నారు. ‘డాడీ’ సినిమాలోని ‘గుమ్మాడి.. గుమ్మాడి’ పాటను రవి పాడుతాడు. రవి పాటతో అక్కడున్న అందరు ఎమోషనల్ అయ్యారు. ఇక బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి అయితే నాన్నని గుర్తు చేసుకుని స్టేజిపై కన్నీరు పెట్టుకుంది. ‘ఇప్పటికీ ఊరికెళ్లితే.. మా నాగంపేట్ మొత్తం డాక్టర్ మల్లేష్ బిడ్డా అంటది” అంటూ ఏడ్చేసింది. ప్రస్తుతం ఈప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.