సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధించిన ఏ వార్త అయిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే వారికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని ఎక్కువ మంది ఆసక్తిగా ఉంటారు. మరి.. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలపై ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్లే కొందరు సెలబ్రిటీలు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వారిలో కొందరు తమ దేశంలో జరుగుతున్న కొన్ని ఘటనలకు మద్దతుగా లేదా వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు మరికొందరు తమదైన రీతిలో నిరసన తెలుపుతుంటారు. తాజాగా ఓ ప్రముఖ సింగర్ కొందరు మహిళలు చేపట్టిన నిరసనకు మద్దతుగా అందరి ముందే స్టేజిపై తన జుట్టును కత్తిరించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఆ సింగర్ ఎవరు ? ఎందుకు అలా చేసింది? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హిజాబ్ కి వ్యతిరేకంగా నిరసనలతో ఇరాన్ దేశం అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. హిజాబ్ ధరించనందుకు 22 ఏళ్ల యువతి మహస అమీనిని పోలీసులు కొన్ని రోజుల క్రితం అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇటీవల ఆమె వారి కస్టడీలో మరణించింది. దీంతో పోలీసులే ఆమెను హింసించి చంపేశారని హిజాబ్ కి వ్యతిరేకంగా అక్కడి మహిళలు నిరసనలు చేపట్టారు. తమ నిరసన తెలుపుతున్న మహిళపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ గొడవల్లో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో నిరసనకారులు చనిపోయారు. ఈక్రమంలో ఇరాన్ మహిళ నిరసనలకు మద్దతుగా ఇతర దేశాల వారు మద్దతు తెలుపుతున్నారు. ఎందరో సెలబ్రిటీలు సైతం మద్ధతుగా నిలిచారు.
తాజాగా టర్కీ ప్రముఖ సింగర్ మెలెక మొసో ఆ మహిళలకు మధ్దతు తెలిపారు. అందరి ముందు స్టేజిపైనే జుట్టు కత్తిరించుకుని ఇరాన్ మహిళల పోరాటానికి అండగా నిలిచారు. ప్రస్తుతం సింగర్ జట్టు కత్తిరించుకున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.షరియా, ఇస్లామిక్ చట్టం ప్రకారం ఏడేళ్లు పైబడిన ముస్లిం అమ్మాయిలు జట్టు కన్పించకుండా తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి. కొన్ని అరబ్ దేశాలు దీన్ని పాటించకపోయినప్పటికీ ఇరాన్ మాత్రం ఈ నిబంధనను తప్పనిసరి చేసింది. అప్పటికే ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకంగా ఉన్న అక్కడి మహిళలు ఇటీవల జరిగిన మహసఅమీనిని మరణంతో తమ వ్యతిరేకతను ఒకసారిగా బయటపెట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
Turkish singer @MelekMosso cuts off her hair on stage in solidarity with the Iranian women. Thank you Melek!#MahsaAmini #مهسا_امینی #IranProtests2022 pic.twitter.com/ZjISxjGkAL
— Omid Memarian (@Omid_M) September 27, 2022