ఆ ఇద్దరికీ అదే ఫస్ట్ మూవీ. ఒకరు ఇప్పుడు పాన్ ఇండియా బిగ్ స్టార్, మరొకరు చాలా గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ స్టార్‌గా ఎదిగినా తమ స్నేహం ఎప్పటికీ చెరగదంటోంది ఈ ముద్దుల భామ. ఆ వివరాలు మీ కోసం.
ప్రభాస్ సినిమా ఈశ్వర్ గుర్తుందా మీ అందరికీ. అదే ప్రభాస్ మొదటి సినిమా. ఇటు నటి శ్రీదేవికి సైతం ఇదే ఫస్ట్ సినిమా. ఆ తరువాత ప్రభాస్ అగ్రహీరో ఎదిగాడు. శ్రీదేవి మాత్రం చాలా గ్యాప్ తీసుకుంది. సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు మళ్లీ సుదీర్ఘ విరామం తరువాత తిరిగి హీరోయిన్గా రీ ఎంట్రీ ఇచ్చింది. నారా రోహిత్ హీరోగా వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కించిన సుందరకాండలో లీడ్ రోల్ చేస్తోంది. ఈ సినిమా వినాయక చవితి నాడు అంటే ఆగస్టు 27న విడుదల కానుండగా టీజర్ ప్రభాస్ విడుదల చేశారు.
పెళ్లి, కుటుంబం, పిల్లల కారణంగా చాలా కాలం సినిమాలకు దూరంగా ఉండిపోయానని, ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లవడంతో సినిమాలు చేసేందుకు అవకాశం లభించిదంటోంది. శ్రీదేవి. ఈ సినిమాలో తన పాత్ర పవర్‌ఫుల్‌గా, కొత్తగా ఉంటుందని చెబుతోంది. సినిమాలో స్కూల్ డ్రెస్ వేసుకునే అవకాశం వచ్చిందంటోంది. ఇది మర్చిపోలేని అనుభూతి అంటోంది. వెంకటేశ్ నిమ్మలపూడికి ఇది మొదటి సినిమా అయినా సరే చాలా అద్భుతంగా తీశారని కితాబిచ్చింది. తనకు, ప్రభాస్‌కు ఈశ్వర్ మొదటి సినిమా కావడంతో ఆయన బిగ్ స్టార్‌గా మారినా ఇప్పటికే తమ మధ్య స్నేహబంధం మాత్రం అలానే ఉందంటోంది. ఇప్పుడు కూడా చిన్న పిల్లాడిలా నవ్వుతూ మాట్లాడతారంటోంది.