గుండెపోటు అనేక మందిని బలి తీసుకుంటుంది. సినీ, రాజకీయాల్లో ఇటీవల కాలంలో హార్ట్ స్ట్రోక్ కారణంగా అనేక మంది చనిపోయారు. ముఖ్యంగా ఎంతో భవిష్యత్తు ఉన్న హీరోలు, నేతలు ఈ మహమ్మారికి బారిన పడి చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్నారు.
గుండెపోటు అనేక మందిని బలి తీసుకుంటుంది. సినీ, రాజకీయాల్లో ఇటీవల కాలంలో హార్ట్ స్ట్రోక్ కారణంగా అనేక మంది చనిపోయారు. ముఖ్యంగా ఎంతో భవిష్యత్తు ఉన్న హీరోలు, నేతలు ఈ మహమ్మారికి బారిన పడి చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. 2021లో కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్ కుమార్ వర్కౌట్స్ చేస్తూ.. గుండె నొప్పికి గురై కన్నుమూసిన సంగతి విదితమే. ఈ ఏడాది టాలీవుడ్ నటుడు తారకరత్న సైతం.. ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొని ఒక్కసారిగా కుప్పకూలి.. సుమారు నెల రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నిన్నటి నిన్న తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ కూడా హార్ట్ ఎటాక్ కారణంగా తుది శ్వాస విడిచారు. ఇప్పుడు మరో యువకుడు ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయాడు.
యువనటుడు, థియేటర్ ఆర్టిస్ట్ హరికాంత్ గుండెపోటుతో ఈ రోజు తెల్లవారు జామున కన్ను మూశారు. అతడి వయస్సు 33 సంవత్సరాలు. థియేటర్ ఆర్టిస్టు అయిన అతడు సినిమాల్లో వచ్చాడు. ఇప్పుడిప్పుడే ఆఫర్లు వస్తున్నాయి. అంతలోనే ఇలా జరిగిపోయింది. హరి కాంత్ తరుణ్ భాస్కర్ సినిమా కీడా కోలాలో నటిస్తున్నాడు. మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నాడని సమాచారం. ఇటీవల కీడాకోలా సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. మరికొన్ని రోజుల్లో అతడి తొలి సినిమా విడుదలవుతుందనగా.. శనివారం ఉదయం హార్ట్ స్ట్రోక్‌కు గురై చనిపోయాడు. ఈ విషయాన్ని సినిమా పీఆర్ఓ ఒకరు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అతడి ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ చేశారు.
A hardworking theater artist turned actor (Keeda Cola & other films) 33-year old Harikanth passed away today in the early hours due to cardiac arrest. May his soul rest in peace. pic.twitter.com/6FbP9sjwwE
— Vamsi Kaka (@vamsikaka) July 1, 2023