సుప్రిత నాయుడు బండారు.. తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ చాలా బాగా పరిచయం. తెలుగు సీనియర్ నటి సురేఖ వాణి కుమార్తెగా అందరికీ తెలుసు. నెట్టింట ఆమె చేసే అల్లరి అంతా ఇంతా కాదు. రీల్స్, ఫన్నీ వీడియోస్, ఇంటర్వ్యూలు అంటూ బాగానే ఫేమస్ అయ్యింది. ఇటీవల తల్లికి మళ్లీ పెళ్లిచేస్తానంటూ సుప్రిత చేసిన వ్యాఖ్యలు ఫుల్ వైరల్ అయ్యాయి. ఎవరో ఒక వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు రెడీగా కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇంకా ఇలాంటి అల్లరికి కొదవే లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానులతో సుప్రిత టచ్‌లో ఉంటుంది. తన లైఫ్‌లో జరిగే, జరుగుతున్న ముఖ్యమైన విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
తాజాగా సుప్రిత తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఓ రీల్ షేర్ చేసింది. సముంద్రం ఒడ్డున మెట్లపై నిల్చొని ఓ క్యూట్ వీడియో చేసింది. నవ్వుతూ పాటకు తగ్గట్లుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఉంది. అలాగే సుప్రిత యాక్టింగ్ కెరీర్ కూడా ఇప్పటికే ప్రారంభించేసింది. ఇటీవలే ఓ కవర్ సాంగ్‌లో కూడా నటించి అందరినీ మెప్పించింది. మంచు లక్ష్మితో కలిసి లేచింది మహిళాలోకం అనే సినిమాలో కూడా సుప్రిత నటిస్తోంది. ప్రస్తుతం సురేఖ వాణి సినిమాల్లో కనిపించట్లేదనే విషయం తెలిసిందే. అయితే అవకాశాలు రాకపోవడం వల్లే నటనకు దూరంగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. నటనలో సురేఖ వాణికి వారసురాలు దొరికిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ వైరల్ గా మారింది.