ఏదైనా సినిమా రిలీజ్ కావడం లేటు.. హీరోహీరోయిన్లపై కాన్సట్రేట్ చేసేవాళ్లే ఎక్కువ. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సహాయపాత్రలు ఎవరు చేశారు. వాళ్ల డీటైల్స్ ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలా అమ్మ, అత్త, వదిన క్యారెక్టర్స్ తో తెలుగులో పాపులర్ అయినవాళ్లు బోలెడు మంది. వాళ్ల గురించి చెప్పమంటే కుర్రాళ్లు తడుముకోకుండా చెప్పేస్తారు. అందులో సురేఖా వాణి, హేమ, ప్రగతి, పవిత్రా లోకేష్ తోపాటు చాలామంది ఉంటారు.
ఇక విషయానికొస్తే.. క్యారెక్టర్ రోల్స్ వీళ్లందరూ కూడా సినిమాల్లో చాలా నార్మల్ గా ఉంటారు. వీళ్లు బయట కనిపించేది తక్కువ. కాస్తోకూస్తో ఇన్ స్టా, యూట్యూబ్ లోనూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే వీళ్లందరూ కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అలానే దాదాపు 12 మంది సీనియర్ నటీమణులు ఒక్కచోటకు చేరారు. తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
ఇక ఈ లేడీ యాక్టర్స్ అందరూ కూడా సురేఖావాణి ఇంట్లోనే కలిసినట్లు తెలుస్తోంది. జస్ట్ కలవడమే కాదన్నట్లు.. ‘రా రా రక్కమ్మ’ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు కూడా వేశారు. ఈ వీడియోని స్వయంగా సురేఖావాణినే తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇక ఈ ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్స్.. తెగ కామెంట్స్ పెడుతున్నారు. ‘అందరూ ఉన్నారు కానీ ప్రగతి, పవిత్రా లోకేష్ మిస్ అయ్యారు’ అని చెప్పుకొస్తున్నారు. మరి సీనియర్ యాక్టర్స్ గెట్ టూగెదర్ ఫొటోలు, వీడియోలు చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.