విపరీతంగా పెరిగిపోయిన సోషల్ మీడియా వాడకం వల్ల నిజం ఏదో, అబద్దం ఏదో తెలుసుకోవడం కష్టంగా మారింది. ఈ కష్టం ఎక్కువగా వచ్చేది సెలబ్రిటీలకే. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు ప్రముఖ నటి హేమ. మరి ఆమె పోలీసులను ఎందుకు ఆశ్రయించారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏదైనా సినిమా రిలీజ్ కావడం లేటు.. హీరోహీరోయిన్లపై కాన్సట్రేట్ చేసేవాళ్లే ఎక్కువ. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సహాయపాత్రలు ఎవరు చేశారు. వాళ్ల డీటైల్స్ ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలా అమ్మ, అత్త, వదిన క్యారెక్టర్స్ తో తెలుగులో పాపులర్ అయినవాళ్లు బోలెడు మంది. వాళ్ల గురించి చెప్పమంటే కుర్రాళ్లు తడుముకోకుండా చెప్పేస్తారు. అందులో సురేఖా వాణి, హేమ, ప్రగతి, పవిత్రా లోకేష్ తోపాటు చాలామంది ఉంటారు. ఇక విషయానికొస్తే.. క్యారెక్టర్ […]
ఈ మద్య టాలీవుడ్ లో ఎక్కడ విన్నా ‘మా’ ఎన్నికల విషయంపైనే చర్చ నడుస్తుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు టాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాంటే సాధారణ ఎన్నికల్లో రాజకీయ నేతలు ఎలాంటి హీట్ పుట్టిస్తారో.. అంతకన్నా ఎక్కువగానే నటీనటులు ఎదుటివారిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన అభ్యర్థులైనా ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే.. మిగతా ప్యానెల్ సభ్యులు కూడా వారికి చేతనైన రేంజిలో […]
మా ఎన్నికల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి హేమపై క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంది. మా అధ్యక్షుడు నరేష్‌పై హేమ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే స్పందించిన మా క్రమ శిక్షణ హేమకు షోకాజ్ నోటీసులు పంపింది. మా ఎన్నికలు జరగకుండా అధ్యక్షుడు అడ్డుపడుతున్నాడని, మా నిధులను దుర్వినియోగం చేశారంటూ విమర్శలు గుప్పించింది. దీంతో హేమ చేసిన వ్యాఖ్యల పట్ల మా ప్యానెల్ అంతా నిర్ణయం తీసుకుని వివరణ ఇవ్వాల్సింది కోరుతూ […]