ఆమె ఓ టాప్ హీరోయిన్. మరో స్టార్ హీరో ముద్దుల తనయ. అంతకుమించి తాను నటించిన సినిమా చూసేందుకు వెళ్లగా సెక్యూరిటీ గార్డ్ అడ్డుకోవడమా..నమ్మశక్యంగా లేదు కదూ. కానీ ముమ్మాటికీ నిజమిది. నేను హీరోయిన్‌ని..నన్ను వెళ్లనివ్వండంటున్న ఆ హీరోయిన్ ఎవరు..అసలు ఏం జరిగింది.. ఆ వివరాలు మీ కోసం.
దక్షిణాది స్టార్ హీరో కమల్ హాసన్ ముద్దుల కుమార్తె, హీరోయిన్ శృతి హాసన్‌కు ఎదురైన చేదు అనుభవమిది. ఆమె నటించిన రజనీకాంత్ సినిమా కూలీ రిలీజ్ డే రోజు జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసింది. కూలీ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు శృతిహాసన్ స్నేహితులతో కలిసి చెన్నైలోని ఓ థియేటర్‌కు వెళ్లినప్పుడు ఆమెకు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని చేదు అనుభవం ఎదురైంది.
దియేటర్ లోపలకు వెళ్లకుండా సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు. నేను హీరోయిన్ అన్నా..ఆ సినిమాలో నటించాను…నన్ను వెళ్లనివ్వండంటూ రిక్వెస్ట్ చేస్తుంటే అందరూ చూస్తుండిపోయారు. ఇది చూసి కారులో ఉన్న శృతి హాసన్ స్నేహితులు పగలబడి నవ్వుకున్నారు. ఇదంతా ఆ కారులో ఉన్న స్నేహితులు వీడియో కూడా తీసి ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేయగానే క్షణాల్లో వీడియో వైరల్ అయిపోయింది.
వైరల్ అయిన వీడియోపై థియేటర్ యాజమాన్యం స్పందించింది. సెక్యూరిటీ గార్డు కాస్త అతి చేసినట్టుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక శృతిహాసన్ మాత్రం ఈ ఘటనను లైట్‌గా తీసుకుంది. ఆ క్షణంలో నవ్వుతూ ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చింది. ఇంతకీ ఓ థియేటర్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి శృతి హాసన్‌ను ఎందుకు గుర్తు పట్టలేకపోయాడో మరి.
“நான் பட ஹீரோயின் சார், என்னை விடுங்க உள்ள” – கூலி திரையரங்கில் நடிகை ஸ்ருதிஹாசன்!#ShrutiHaasan | #Coolie | #Rajinikanth pic.twitter.com/AUzidT7UHg
— PttvOnlinenews (@PttvNewsX) August 15, 2025