హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజాగా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో పవన్ సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది ధమాకా బ్యూటీ శ్రీలీల.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓవైపు రాజకీయాల్లో క్రీయాశీలంగా దూసుకుపోతూనే.. అంతే స్పీడ్ తో సినిమాలు చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తు.. ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో తీరికలేకుండా షూటింగ్ లతో బిజీగా గడుపుతున్నారు పవన్. ఇక పవన్ సరసన నటించాలని చాలా మంది హీరోయిన్స్ కలలు కంటుంటారు. ఒక్క సారి స్క్రీన్ షేర్ చేసుకుంటే చాలు అని ఆరాటపడుతుంటారు. అలాంటి లక్కీ ఛాన్స్ కొట్టేసింది క్రేజీ హీరోయిన్ శ్రీలీల. అవును ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోందని సమాచారం.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజాగా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ సినిమా అయిన తేరి మూవీకి రీమేక్. అందులో విజయ్ హీరోగా నటించగా.. హీరోయిన్లుగా సమంత, అమీ జాక్సన్ నటించారు. అయితే హరీష్ శంకర్ కేవలం తేరి సినిమా లైన్ మాత్రమే తీసుకుని.. తెలుగు తనానికి తగ్గట్లుగా చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో తొలుత పూజా హెగ్డే నటిస్తుందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు పవన్ సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది ధమాకా బ్యూటీ శ్రీలీల.
ఈక్రమంలోనే మార్చి చివరి నుంచి సెట్ మీదకు వెళ్లనున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీలను ఫైనల్ చేసినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే కనుక నిజం అయితే ధమాకా మూవీతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీల.. లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే. ఇక ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్, OG ప్రాజెక్ట్ లతో మంచి స్వింగ్ లో ఉన్నారు పవర్ స్టార్. మరి పవన్ సరసన శ్రీలీల నటిస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.