మంగ్లీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన సినీ, జానపద, భక్తి గీతాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకుంటారు. తాజాగా మరోసారి ఓ షూట్ విషయంలో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
మంగ్లీ.. ఈ తెలంగాణ గాయని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జానపద గీతాలు పాడుతూ అందర్ని ఆకట్టుకునేది. ఇప్పుడు సినిమా పాటలతో మంగ్లీ మంచి క్రేజ్ సంపాదించుకుంది. జానపదం అయినా, భక్తి గీతమైనా, ఐటం సాంగ్ అయినా.. మంగ్లీ పాడితే దాని స్థాయి వేరే లేవల్ లో ఉంటుంది. ఐతే మంగ్లీ పాడిన పాటలు కొన్ని సందర్బాల్లో వివాదాలకు కూడా దారి తీస్తుంటాయి. గతంలో మంగ్లీ పాడిన ఓ భక్తి పాట వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ వివాదంపై మంగ్లీ కూడా సున్నితంగానే క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి మంగ్లీ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇటీవలే మహాశివరాత్రి సందర్భంగా ఆమె శ్రీకాళహస్తిలో ఓ పాటను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ షూటే వివాదానికి దారి తీస్తోంది. మరి.. పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
సింగర్ మంగ్లీ శివుడి పాటలు పాడుతూ అందర్ని ఆకట్టుకుంటుంది. అంతేకాక ప్రతీ ఏడాది మహాశివరాత్రికి ఆమె నోటి నుంచి ఆ పరమశివుడి పాటలు వస్తూనే ఉంటుంది. అంతేకాక శివరాత్రికి ఆమె పాడే పాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటాయి. ప్రతీ ఏటా మంగ్లీ కొత్త ప్రాంతాల్లో పాటలు పాడుతూ, నృత్యం చేసే షూట్ జరుగుతుంది. ఈ ఏడాది మహాశివరాత్రికి సైతం మంగ్లీ ఓ కొత్త పాట పాడింది. ఆ పాట షూటింగ్ శ్రీకాళహస్తిలోని కాలభైరవ స్వామి ఆలయంలో షూట్ చేశారు.
ఈ పాటను ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్ రచించారు. అయితే ప్రస్తుతం ఈ పాట వివాదంలో చిక్కుకుంది. దీంతో మరోసారి మంగ్లీ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీకాళహస్తిలోని కాలభైరవస్వామి ఆలయంలో షూటింగ్ కి అనుమతి లేదు. అయితే మంగ్లీ పాటకు మాత్రం అక్కడ షూటింగ్ జరిగినట్లు సమాచారం. స్వామి వారి ఆలయంలో పాటను ఎలా షూట్ చేస్తారు.. అనుమతి లేదు కదా? అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణ కైలాసంగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి పేరు ఉంది. ఈ ఆలయంలో రెండు దశాబ్దాల నుంచి వీడియో చిత్రీకరణకు అనుమతించడం లేదు. అయితే శివరాత్రి ఆ ఆలయంలో మంగ్లీ శివుడి పాటను చిత్రీకరించింది. ప్రతీ ఏటా ఓ శివుడి పాటతో మంగ్లీ అందరినీ పలకరిస్తుందన్లటే ఆ సారి మరో శివుడి పాటతో అందరి ముందుకు వచ్చింది. అయితే ఈ ఏడాది శ్రీకాళహస్తిలోని ఆలయంలో పాటను చిత్రీకరించింది. రెండు దశాబ్దాలుగా షూటింగ్ లకి అనుమతి లేని ఆయలంలో మంగ్లీ మాత్రం ఇలా పాటను షూట్ చేసింది. ఆలయంలోని కాలభైరవస్వామి విగ్రహం వద్ద మంగ్లీ నృత్యం చేసిన విజువల్స్ ఆ పాటలో ఉన్నాయి.
రాయల మండపం, రాహు కేతు మండపం, ఊంజల్ సేవ మండపాలలో మంగ్లీ ఆటపాట సాగింది. ముక్కంటి ఆలయంలో మంగ్లీ ఆటాపాటలు ఇప్పుడు వివాదానికి దారి తీస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా చిత్రీకరించి యూట్యూబ్‌లో విడుదల చేయడం మీద ఇప్పుడు భక్తులు మండిపడుతున్నారు. మామూలుగా అయితే అక్కడ గత కొన్నేళ్లుగా ఆలయంలో షూటింగ్‌కి అనుమతి లేదని, అయినా ఎలా షూట్ చేశారంటూ స్థానికులు నిలదీస్తున్నారు. ప్రస్తుతం మంగ్లీ షూట్ చేసిన శివరాత్రి పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ లో ఉంది. మరి.. ఈ ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.