లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమై సింహాద్రి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న ఆ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏం చేస్తోంది? ఎలా ఉంది? ప్రస్తుతం ఆ హీరోయిన్ కు సంబందించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
సినిమా రంగంలోకి వస్తున్న హీరోయిన్లు తమ అందచందాలతో, నటనతో మెప్పించి స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవాలని బలంగా కోరుకుంటారు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు. కొన్ని సినిమాలతో గుర్తింపు వచ్చినా అది ఎక్కువకాలం నిలువక నటనకు దూరమవుతారు. ఇదే విధంగా చాలా మంది హీరోయిన్లు తమ సినీ కెరీర్ కు గుడ్ బై చెప్పి పెళ్లిల్లు చేసుకుని స్థిరపడిన వారు చాలమందే ఉన్నారు. ఇదే కోవలో సింహాద్రి సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించి అభిమానుల్లో చెరగని ముద్ర వేసింది ఆ హీరోయిన్. అందమైన చూపులతో కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ సక్సెస్ కాలేకపోయింది. తెలుగులో లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో వెండితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఎవరో గుర్తొచ్చిందా.. ఆమె మరెవరో కాదు, తనే టాలీవుడ్ హీరోయిన్ అంకిత.
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాలో హీరోయిన్లుగా భూమిక, అంకిత నటించారు. ఈ సినిమాలో నటి అంకిత కస్తూరి పాత్రలో అలరించింది. కాగా సింహాద్రి రిలీజ్ అయి 20ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న రీ రిలీజ్ చేశారు. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయిన సింహాద్రి రీ రిలీజ్ తో కూడా రికార్డ్ సృష్టించింది. ఇదిలా ఉంటే సింహాద్రి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న నటి అంకిత ఆ తర్వాత విజయేంద్ర వర్మ, నవ వసంతం, సీతారాముడు, తో పాటు కన్నడ, తమిళ్ సినిమాల్లో నటించింది. ఆ సినిమాలతో సక్సెస్ అందుకోలేని నటి అంకిత 2016లో విశాల్ జగతాప్ అనే వ్యక్తిని పెళ్లాడింది. మ్యారేజ్ అయ్యాక నటనకు స్వస్తిచెప్పి భర్త తో కలిసి న్యూజెర్సీలో సెటిలయ్యింది ఈ బామ. వీరికి ఇద్దరు కుమారులున్నారు. దీంతో ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయిపోయింది నటి అంకిత.