కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్వేతా బసు ప్రసాద్. ఎకడా… అంటూ పలికిన ఒక్క డైలాగ్ కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టింది. అమాయకమైన ముఖం.. స్వచ్ఛమైన చిరునవ్వు.. చక్కని రూపు.. ఇలా తన అందంతో.. కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా.. అవేవి ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. ఆ తర్వాత శ్వేత మీద వచ్చిన ఆరోపణలతో ఆమె కెరీర్ పూర్తిగా డల్ అయ్యింది. తెలుగులో ఆమెకు అవకాశాలు రాలేదు. ఏడేళ్ల తర్వాత 2018లో విజేత సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా ఆమెకు ఉపయోగపడలేదు.
ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ సినిమాలు, సీరియల్స్, వెబ్ సీరిస్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. పెళ్లైన ఏడాదికే డైవర్స్ తీసుకుంది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీదనే పెట్టింది. జనవరి 11న శ్వేత పుట్టిన రోజు. స్నేహితులతో కలిసి గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరలవుతున్నాయి.
ఇక ఈ ఫోటోల్లో శ్వేతను చూసిన నెటిజనులు.. ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఇలా మారిపోయింది.. ముక్కుకు ఏమైనా సర్జరీ చేయించుకుందా.. మరీ ఇంత దారుణంగా తయారయ్యింది ఏంటి.. కొత్త బంగారులోకం సినిమాలో క్యూట్, చబ్బీగా ఉండి ఎంత అందంగా ఉంది.. మరి ఇప్పుడేంటి.. ఇలా మారింది.. కొన్ని ఫొటోల్లో అసలు పోల్చుకోలేకపోతున్నాం అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఫొటోలు చూస్తే.. మీకేమనిపిస్తుంది.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.