మోడల్స్ ఎవరూ ఖాళీగా ఉండట్లేదు! ఇన్ స్టాగ్రామ్ యూజ్ బాగా పెరిగిపోయిన తర్వాత అస్సలు టైం వేస్ట్ చేయట్లేదు. ఇక నెటిజన్లని ఎంటర్ టైన్ చేయడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. స్టార్ హీరోయిన్లు, చిన్న ఇన్ఫ్లూయెన్సర్లు అనే తేడా లేకుండా ఒకరికి మించి మరొకరు రెచ్చిపోతున్నారు. బికినీలతో కొందరు హాట్ నెస్ పెంచేస్తుంటే, మరికొందరు మాత్రం ఒంటిపై ఎలాంటి దుస్తుల్లేకుండానే పోజులిస్తున్నారు. ఇప్పుడు కూడా సేమ్ అలానే జరిగింది. తెలుగు సినిమాతో నటిగా పరిచయమైన ఈ భామ.. ఇప్పుడు హిందీలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఇన్ స్టాలో హీట్ పెంచేస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. శ్రియ ధన్వంతరి, ఈ పేరు చెప్పగానే ఎవరా అని ఆలోచిస్తారు కానీ స్కామ్ 1992, ఫ్యామిలీ మ్యాన్ బ్యూటీ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. హైదరాబాద్ లో పుట్టిన శ్రియ.. ఇక్కడే నిట్ వరంగల్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఇక శ్రియ తల్లి తెలుగు ఆమెనే. అలా చదువుతున్నప్పుడే మోడల్ గా చేసిన శ్రియ.. ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో రన్నరప్ గా నిలిచింది. అదే ఏడాది మిస్ ఇండియా ఫైనలిస్ట్ గా నిలిచింది. అలా ఆమెకు నాగచైతన్య ‘జోష్’లో నటించే అవకాశమొచ్చింది. ‘స్నేహగీతం’ మూవీలో నటించింది. ఇక ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైపోయింది.
హిందీలో లూప్ లపేటా, చుప్ సినిమాల్లో నటించిన శ్రియ.. ద ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992, ముంబయి డైరీస్ 26/11, గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీసుల్లోనూ లీడ్ రోల్స్ చేసింది. నటిగా సూపర్ సక్సెస్ అయింది. ఇక యాక్టింగ్ పరంగా కెరీర్ బాగానే ఉంది. అలా అని అస్సలు ఊరుకోవట్లేదు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లని రెచ్చగొడుతోంది. ఇక తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలైతే నెక్స్ట్ లెవల్ ఉన్నాయి. పొదల మాటున నగ్నంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. చూస్తుంటే చలికాలంలో హీట్ పెంచేస్తున్నట్లు అనిపిస్తోంది. ‘డ్రస్ వేసుకోవడం మర్చిపోయావా?’ అని పలువురు నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.