ప్రముఖ బాలీవుడ్ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత మనోజ్ బాజ్‌పేయీని విషాదాలు వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఏడాది వ్యవధిలో ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆయనను మరోసారి విషాదం పలకరించింది. తాజాగా ఆయన కుటుంబంలో మరోకొరు మృత్యువాత పడ్డారు. మనోజ్ బాజ్ పేయీ అత్తగారు చనిపోయారు.
మనోజ్ బాజ్‌పేయీ భార్య షబానా తల్లి షకీలా రజా అనారోగ్యంతో గురువారం సాయంత్రం కన్నుమూశారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. షకీలా రజాకు క్యాన్సర్ ఉంది. గత 12 ఏళ్లుగా ఆమె క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయిన్పటికి ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం చికిత్స పొందుతూ షకీలా రజా కన్నుమూశారు. తన అత్తగారి మరణ విర్త విన్న వెంటనే షూటింగ్స్ నిలిపివేసి.. మనోజ్ వాజ్ పేయీ ఢిల్లీకి చేరుకున్నారు.
గత ఏడాది కాలంలో మనోజ్ బాజ్‌పేయి కుటుంబంలో ఇది మూడో మరణం. 2021లో మనోజ్ బాజ్‌పేయీ మామ, షకీలా రజా భర్త కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన చనిపోయారు. అంతేకాదు అదే ఏడాది మనోజ్ బాజ్‌పేయీ తండ్రి ఆర్కే బాజ్‌పేయీ కూడా కన్నుమూశారు. ఆయన తండ్రి గత ఏడాది అక్టోబర్ 3న మరణించారు. మరణించడానికి కొన్నాళ్ల ముందు నుంచే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. ఆ క్రమంలోనే ఆయన్ని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేసి చికిత్స అందించారు. ఐతే పరిస్థితి విషమించడంతో.. 83 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు. ఏడాది కాలంలోనే ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం విషాదకరం.. ధైర్యంగా ఉండండి అంటూ మనోజ్ బాజ్ పేయీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.