ఈ మద్య కొంత మంది సెలబ్రెటీల ఇళ్లు టార్గెట్ చేసుకొని బాంబు బెదిరింపులకు పాల్పపడుతున్నారు. తమిళనాట విజయ్, అజిత్ కుమార్ ఇంటిని పేల్చేస్తామని కాల్స్ రావడం.. వారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ బంగ్లా మన్నత్ ను బాంబుతో పేల్చివేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నివసిస్తున్న జితేష్ ఠాకూర్ అనే వ్యక్తి బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు తెలుసుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.
2022 జనవరి 6న జితేష్ ఠాకూర్ మహారాష్ట్ర పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి, షారూఖ్ బంగ్లాను బాంబుతో పేల్చివేస్తానని చెప్పాడు. ఆ కాల్ లో షారుక్ బంగ్లాతో పాటు ముంబైలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు, బాంబు పేలుళ్లు చేస్తామని బెదిరించాడు. ముంబై పోలీసులు కాల్‌ను ట్రేస్ చేసి, ఆ నంబర్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నుండి వచ్చిందని కనుగొన్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు కాల్ చేసిన జితేష్ ఠాకూర్ మద్యానికి బానిసై ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది చదవండి : సైనా నెహ్వాల్ పై హీరో సిధ్దార్ధ్ అసభ్య పదజాలం.. మహిళా కమీషన్ సీరియస్
గతంలో కూడా ఫేక్ కాల్స్ చేసి పోలీసు ఎస్‌ఓఎస్ సర్వీస్ డయల్ 100 ఉద్యోగులతో గొడవ పడ్డాడని తెలుస్తోంది. నిందితుడిని అరెస్టు చేసినప్పటికీ అనుమానాస్పదంగా ఏమీ కన్పించలేదని పోలీసులు తెలిపారు. దీంతో షారూఖ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
jabalpur police arrested man threatened to blow up Shahrukh Khan Mannat with bomb mpsn | इस शख्स ने शाहरुख खान के ‘मन्नत’ को बम से उड़ाने की दी धमकी, जानिए मामला https://t.co/ooqnTnNoQW
— taza24 news (@Taza24N) January 9, 2022
Recently someone called mumbai police and claimed to carry several bomb blasts including Mannat.
Caller Identified as Jitesh Thakur from Jabalpur, Madhya Pradesh
He was arrested by Jabalpur police.
— 𝕯𝖊𝖊𝖕ˢʳᵏⁱᵃⁿ 🔥 (@SRKz_Deep) January 10, 2022