ప్రముఖ నటికి పెళ్ళై ఏడాది అయ్యింది. ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. చిన్న వయసులోనే ఎంత ఘోరం జరిగిపోయింది.
ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కమల్ హాసన్ తో కలిసి విచిత్ర సోదరులు సినిమాలో నటించిన నటుడు మోహన్ రోడ్డు పక్కన దీనస్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోకముందే మరొక విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కోలీవుడ్ సీరియల్ నటి శృతి షణ్ముగప్రియ తన జీవితంలో విలువైనదొకటి కోల్పోయింది. ఏడాది క్రితం తన జీవితంలోకి వచ్చిన జీవిత భాగస్వామిని కోల్పోయింది. జీవితాంతం కలిసుంటానని మాటిచ్చిన ఆమె భర్త ఆమెను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శృతి షణ్ముగ ప్రియ భర్త అరవింద్ శేఖర్ (30) అతి చిన్న వయసులో కన్నుమూశారు. కొన్నేళ్లు కలిసి సహజీవనం చేసిన షణ్ముగప్రియ, అరవింద్ గత ఏడాది మే నెలలో వివాహం చేసుకుని అధికారికంగా ఒకటయ్యారు.
శృతి ఒక థియేటర్ ఆర్టిస్ట్. నాథస్వరం సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న షణ్ముగ ప్రియ ఆ తర్వాత వాణి రాణి, కళ్యాణ పరిసు, పొన్నుంచల్, భారతి కన్నమ్మ వంటి అనేక సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. ఆమె భర్త అరవింద్ శేఖర్ ఒక బాడీ బిల్డర్ మరియు వెయిట్ లాస్ కోచ్. ఆగస్టు 2న సాయంత్రం గుండెపోటు రావడంతో ఆయనను హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. సోషల్ మీడియాలో ఈ జంటకు చాలా మంది అభిమానులు ఉన్నారు. షణ్ముగ ప్రియ భర్త మరణించారన్న వార్త తెలిసి షాకయ్యారు. 30 ఏళ్ల వయసులోనే మరణించాడని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆమె భర్త మరణ వార్తను ఆమె ఇన్ స్టా ఖాతా ద్వారా వెల్లడించింది. శరీరం మాత్రమే దూరమైంది. నీ ఆత్మ, మనసు నా చుట్టూనే తిరుగుతాయి. అవి తనను ఇప్పటికీ, ఎప్పటికీ రక్షిస్తాయని.. నా ప్రియమైన భర్త అరవింద్ శేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలి. నీపై నా ప్రేమ మరింత పెరుగుతుంది, ఇప్పుడు చాలా ఉంది. మనం ఇప్పటికే జీవితానికి సరిపడా జ్ఞాపకాలను కలిగి ఉన్నాము. నిన్ను కోల్పోతున్నాను.. నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను అరవింద్. నా పక్కన నువ్వున్నావని భావిస్తాను’ అంటూ ఆమె భావోద్వేగభరితంగా రాసుకొచ్చింది. ఆ పోస్ట్ ఇప్పుడు నెటిజన్స్ ని కంటతడి పెట్టిస్తుంది. అరవింద్ కి సద్గతులు ప్రాప్తించాలని భగవంతుణ్ణి కోరుకుందాం. ఓం శాంతి.