సెలబ్రిటీల లైఫ్ స్టైల్ పైకి చూడటానికి రిచ్ గా కనిపించినా.. కొంతమంది తారల జీవితాలు మాత్రం ఎన్నో కష్టాలమయమై ఉంటాయి. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్, ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఫామ్ లో ఉన్నప్పుడు ఒకలా.. ఫామ్ లో లేనప్పుడు ఒకలా మర్యాద ఇస్తుంటారని వింటుంటాం. ఎప్పుడో సీనియర్స్ అయిపోయి.. సినిమాలు మానేశాక ఏదొక ఇంటర్వ్యూలో తమ కెరీర్ లో జరిగిన విశేషాలను, బాధించిన సంఘటనలను షేర్ చేసుకుంటుంటారు. అలాంటి వారిలో సీనియర్ నటి పూజిత ఒకరు. ఈమె గురించి ఇప్పుడున్న తరానికి తెలియకపోయినా.. 1990స్ లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ ఇండియాని ఓ ఊపేసింది.
నటిగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సుమారు 130కి పైగా చేసిన పూజిత.. కేవలం తెలుగులోనే 70కి పైగా సినిమాలలో నటించడం విశేషం. కెరీర్ లో ఎక్కువ చిత్రాలు రాజేంద్రప్రసాద్ తో చేసినట్లుగా తెలుస్తోంది. ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’, ఆమ్మో అల్లుడా, రేపటి కొడుకు లాంటి సినిమాలతో పాటు మరెన్నో సినిమాలు చేసింది. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో చాలా సినిమాలు చేసింది. అయితే.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ పై కామెంట్స్ చేస్తూ.. నటుడు నరేష్ పై పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యింది పూజిత. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
నటి పూజిత మాట్లాడుతూ.. “నేను కష్టాలలో ఉన్నప్పుడు అడ్వకేట్ చెప్పాడని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ లెటర్ కోసం వెళ్లాను. మురళీమోహన్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను ఈసీ మెంబర్ గా ఉన్నాను. కానీ.. ఆ తర్వాత వచ్చిన వాళ్ళతోనే అసలు ప్రాబ్లెమ్స్ వచ్చాయి. నేను లెటర్ కోసం వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్న రాజేంద్రప్రసాద్.. అసలు నేనెవరో తెలియదు, నాతో మాట్లాడితే తప్పు అన్నట్టుగా బిహేవ్ చేశారు. అయన ఎక్కడినుండి ఆ స్థాయికి వెళ్లారో మరిచిపోయారు. అంతకుముందు ఇద్దరం ఈసీ మెంబర్స్ గా చేసినవాళ్లమే. ఇద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. కానీ.. ఆయన ప్రెసిడెంట్ స్థాయి రాగానే ఈసీ మెంబర్ ని తక్కువ చూశారు. ముందు ఆయన ఎక్కడినుండి ప్రెసిడెంట్ గా ఎదిగాడో గుర్తుంటే కదా.. మేం ఎవరూ తెలీదని పోయే కాలం వచ్చినట్టు ప్రవర్తించారు.
నాకు అడుక్కోవడం ఇష్టం ఉండదు. ఓ గంట వెయిట్ చేశాను. కానీ.. వాళ్లు కనీసం నేను ఇచ్చిన పేపర్ ని కూడా చదవలేదు. నేను ఓట్లు వేస్తే గెలిచిన వాడు.. నన్ను అవమానించడం నాకు నచ్చలేదు.రాజేంద్రప్రసాద్ పక్కన నేను హీరోయిన్ గా చేశా అయినా హెల్ప్ చేయలేదు. అప్పుడు శివాజీరాజా జనరల్ సెక్రెటరీగా ఉన్నాడు. నిజానికి నేను నరేష్ తో మూడు సినిమాలు చేయాలి. కానీ.. కుదరలేదు. కానీ.. అతను నా బాబుకి హెల్ప్ చేశాడు. చాలా మంచి మనసున్న వ్యక్తి నరేష్. ‘మా’కి నరేష్ చాలా చేశారు. ఇన్ని మంచి పనులు చేసి.. చివరికి ఏరికోరి.. శనిని నెత్తిమీదకి తెచ్చుకున్నాడు.” అని చెప్పుకొచ్చింది. మరి నటి పూజిత మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.