గత కొన్ని నెలలుగా చిత్ర పరిశ్రమలో విషాదాలు నెలకొంటూనే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించగా.. నెల క్రితం సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఇక రెండు రోజుల క్రితం ప్రముఖ నటుడు చలపతి రావు గుండెపోటుతో మరణించారు. ఈ విషాదల నుంచి కోలుకోక ముందే మరో విషాదం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్థన్ (63)అనారోగ్యంతో గురువారం మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
వల్లభనేని జనార్థన్.. తెలుగు చిత్రసీమలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించడంతో గురువారం ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు. జనార్థన్ ప్రముఖ నిర్మాత విజయబాపినీడు అల్లుడు. ఇక జనార్థన్ నటుడిగా.. సుమారు 100కు పైగా సినిమాల్లో నటించారు. నటనతో పాటుగా పలు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం సైతం వహించారు. చంద్రమోహన్ హీరోగా ‘అమాయక చక్రవర్తి’, శోభన్ బాబు హీరోగా హిందీలో వచ్చిన బసేరా సినిమాను తెలుగులో ‘తోడు-నీడ’ రూపొందించారు. అదీకాక తన కూతురు శ్వేత పేరుమీదుగానే ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ సినిమాలోని పాత్రకు మంచి గుర్తింపు లభించింది. జనార్థన్ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Senior Director, Actor and Producer Sri Vallabhaneni Janardhan garu passed away today (29-12-2022).
RIP pic.twitter.com/4NkjFQlkx2
— Suresh Kondi (@SureshKondi_) December 29, 2022