ప్రపంచంలో పరిపూర్ణమైన వ్యక్తులు అంటూ ఎవరూ ఉండరు. ఒక్క స్త్రీ మాత్రమే అమ్మతనం ద్వారా పరిపూర్ణతను సాధిస్తుంది. ఆ అమ్మతనాన్నే పెళ్లైయ్యాక ప్రతీ మహిళ కోరుకుంటుంది. ప్రస్తుత ఆధునిక సమాజంలో పిల్లలు లేని దంపతుల సంఖ్య పెరుగుతోంది. అలాగే వారి బాధలూ వర్ణణాతీతం. అమ్మా.. అని పిలిపించుకోవాలని కనపడ్డ ఆస్పత్రులన్నీ తిరుగుతారు. ప్రస్తుతం పిల్లలు కావడం కోసం ఐవీఎఫ్, సరోగసీ పద్దతులు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ బాలీవుడ్ నటి తనకు పిల్లలు లేకపోవడం గురించి చెప్తూ కన్నీరుమున్నీరైంది. మరి ఆ వివరాల్లోకి వెళితే..
సంభావన సేత్.. బాలీవుడ్ లో తనకుంటూ ఓ పేరు సంపాదించుకుంది. అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లో అలరించింది. ఈ క్రమంలో ఆమె లావుగా అవుతోందని నెటిజన్స్ ట్రోల్స్, కామెంట్స్ చేశారు. తాజాగా దీనిపై ఆమె మాట్లాడుతూ.. ”నేను నాలుగోసారి ఐవీఎఫ్ పద్ధతి ప్రయత్నించగా అది ఫెయిల్ అయిందని.. అందువల్లే బరువు పెరిగానని” తెలిపింది. సంభావన సేత్- అవినాష్ దంపతులకు పెళ్లై 6 సంవత్సరాలు అవుతోంది. ఈక్రమంలో తనకు పిల్లలు కలగక పోవడంపై క్రింది విధంగా స్పందించింది.
‘పిల్లలను కనాలని ఐవీఎఫ్ పద్ధతిని ఎంచుకున్నాం. కానీ దీని వల్ల కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. చల్లటి ప్రదేశాల్లో ఎక్కువ సేపు ఉంటే చాలు కాళ్లు, చేతులు మొద్దుబారిపోతున్నాయి. తర్వాత వాపు, లేదంటే నొప్పి వస్తోంది. కొన్నిసార్లు నన్ను చూస్తే నాకే కోపమొస్తోంది. అసలు నాకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మంచి జరగబోతుందనుకునేలోపు ఏదో ఒక చెడు జరుగుతుంది. తాజాగా తాను ర్యూమటాయిడ్ ఆర్థరైటిస్‌తో” అంటూ సంభావన తన బాధను వీడియోలో పంచుకుంది.
నా వల్ల నా భర్త అవినాష్ కూడా బాధపడుతున్నట్లు తెలిపింది. ఈ సమస్యలతో నిత్యం పోరాడుతూ ఉండటం నరకంగా ఉందని అన్నారు. అటు ఆమె భర్త అవినాష్ సైతం ఇలాంటి వైద్య విధానాలు అంత సులువుగా ఏమీ ఉండవన్నాడు. దీనివల్ల శరీరంలో హార్మోన్స్ అదుపు తప్పుతాయని, అంతమాత్రానికే తన భార్యను నోటికొచ్చినట్లు అంటే బాగోదని హెచ్చరించాడు. పిల్లల కోసం ఓ మహిళ పడే బాధపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.