బాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు సల్మాన్ ఖాన్. వరుస సినిమాలతో తెగ బిజీగా మారి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పటికి కూడా శారీరకంగా చాలా స్ట్రాంగ్ గా కనిపించే ఈ బాలీవుడ్ కండలవీరుడు ఓ వింత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశం ఇప్పుడు బాలీవుడ్ లో ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ట్రైజెమినల్ న్యురాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ వ్యాధి సోకిన వక్తులకు ఎక్కువ సేపు మాట్లాడితే మూతి వంకరపోవడం, ముఖ నరాల వల్ల ముఖం భాగం నొప్పిగా ఉంటాయట. ఇదే కాకుండా బ్రష్ చేసినా, మేకప్ వేసుకున్నా విపరీతమైన నొప్పి కూడా కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న సల్మాన్ దీనిని అధిగమించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: బాక్సాఫీస్ వద్ద తగ్గని KGF-2 జోరు! RRR రికార్డ్స్ బ్రేక్!
ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానలు కాస్త ఆందోళన చెందుతున్నారట. అయితే ఇలాంటి వ్యాధి సోకిన వ్యక్తులకు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు కలుగుతాయట. సల్మాన్ ఖాన్ ట్రైజెమినల్ న్యురాల్జియా అనే వ్యాధితో బాధపడుతుండంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
