సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం బిగ్గెస్ట్ సినిమాల హవా నడుస్తోంది. ఈ మద్య దక్షిణాది నుంచి ఎక్కువగా పాన్ ఇండియా మూవీలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. షూటింగ్ సమయంలో దర్శక, నిర్మాతలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కొన్ని లీకులను మాత్రం అరికట్టులేకపోతున్నారు. ఫస్ట్ లుక్ కన్నా ముందే సోషల్ మీడియాలో హీరో, హీరోయిన్లకు సంబంధించిన లుక్ లీక్ కావడంతో తలలు పట్టుకుంటున్నారు.
‘బాహుబలి’తో పాన్ ఇండియా హీరోగా మారాడు ప్రభాస్. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన సంచలనం సృష్టించిన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ ‘సలార్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు. తాజాగా షూటింగ్ స్పాట్ లో ప్రభాస్ మాస్ లుక్ లో ఉండగా ఎవరో ఫోటో తీసి లీక్ అయ్యింది. ఈ పిక్ చూస్తే మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేయొచ్చు అంటున్నారు ఫ్యాన్స్. రెండో షెడ్యూల్ తొలి రోజే చిత్ర యూనిట్ కి షాక్ తగిలింది.
ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో జగపతి బాబు, పృథ్విరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు నటిస్తున్నారు. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఇటీవల విడుదలై అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ క్రమంలోనే ‘సలార్’పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Prabhas at #Salaar set. ⭐ pic.twitter.com/MtqLyjmmSF
— Ashwani kumar (@BorntobeAshwani) May 23, 2022
#Salaar #Prabhas shooting resumes from tomorrow 🔥 pic.twitter.com/eiyKaAZq4f
— Prabhas Trends™ (@TrendsPrabhas) May 23, 2022