నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. మొదటి సినిమాతోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నేను లోకల్, అజ్ఞాతవాసి సినిమాలు చేసిన కీర్తి సురేష్ కి.. మహానటి సినిమాతో ఇండస్ట్రీలో మహానటిగా క్రేజ్ దక్కించుకున్నారు. నటన ప్రాధాన్యత ఉన్న సినిమాలే కాకుండా గ్లామరస్ పాత్రలు సైతం చేయగలనని నిరూపించారు కీర్తి సురేష్. ఇక మొన్ననే 30లో అడుగుపెట్టారు. దీంతో ఇంట్లో పెళ్లి ముచ్చట రాకుండా ఉంటుందా? ప్రతీ తల్లిదండ్రులూ.. కోరుకునేది అదే. పిల్లల పెళ్లి చూసి.. వారికి పుట్టిన మనవడ్నో, మనవరాలినో ఎత్తుకుని ఆడించాలని కలలు కంటారు. దాని కోసం పిల్లల మీద ఒత్తిడి తెస్తుంటారు. గత కొంతంకాలంగా మహానటిని పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారట.
ఇప్పటికే కీర్తికి తగ్గా జోడీని వెతికారట. అన్ని విధాల కీర్తికి సెట్ అయ్యే యువకుడ్ని వెతికినట్లు వార్తలు వస్తున్నాయి. అబ్బాయి కూడా కీర్తి సురేష్ కి నచ్చాడట. తనకి ఈ పెళ్లి ఇష్టమేనని తల్లిందండ్రులతో చెప్పిందట. త్వరలోనే దీనికి కీర్తి సురేష్ పెళ్ళికి సంబంధించిన ప్రకటన రానుందని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని కీర్తి సురేష్ అనుకున్నారని, ప్రస్తుతం ఉన్న సినిమాలు పూర్తి చేసి పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్, దసరా సినిమాల్లో నటిస్తుండగా.. తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది.