రామ్ చరణ్, రాజమౌళి, తారక్ కాంబోలో తెరకెక్కిన పాన్ వరల్డ్ చిత్రం RRR. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో టీమ్ మొత్తం ఫుల్ బిజీగా ఉంది. మార్చి 19న బెంగళూరు వేదికగా కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కూడా హాజరు కానున్నారు. మార్చి 18న దుబాయ్ లోనూ ఒక ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. అటునుంచి నేరుగా బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఈ టీమ్ కు ఊహించని ఘటన ఎదురైంది.
ఇదీ చదవండి: భారీగా పెరిగిన RRR టికెట్ రేట్లు.. ఫ్యాన్స్ అసహనం!
విమానాశ్రయంలో రామ్ చరణ్, తారక్, రాజమౌళిని అభిమానులు చుట్టిముట్టేశారు. వాళ్లతో ఫొటోలు దిగేందుకు చుట్టేముట్టేశారు. వాళ్లను కంట్రోల్ చేసేందుకు సెక్యూరిటీ సిబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు. అభిమానుల మధ్యలో RRR టీమ్ మొత్తం నలిగిపోయింది. ఆ తర్వాత అతి కష్టం మీద వాళ్లను బయటకు తీసుకెళ్లారు. అక్కడ అభిమానులు చరణ్, తారక్ అంటూ గట్టిగా కేకలు వేశారు. బొకేలు, పూలు తీసుకొచ్చి వారి అభిమాన హీరోలకు స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Man Of Masses Ram Charan at Bangalore Airport 🤙🔥 pic.twitter.com/amMpwe63ta
— Kasapogu Prakash (@Kasapogu1981) March 18, 2022
What a Massive Welcome by our #Dubai fans! Feels like we are in India… Love you so much ❤️ #RRRinDubai #RRRMovie pic.twitter.com/QqSKNr2Jnu
— RRR Movie (@RRRMovie) March 18, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.