ఇండియన్ సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం తెలుగు సినిమాల వైపు చూస్తోంది. బాహుబలి నుండి RRR వరకు సినీ దేశవ్యాప్తంగా అటెన్షన్ క్రియేట్ చేసుకుంది టాలీవుడ్. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా పై అభిమానులలో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్.. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.
RRR రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ లో సినిమా హైప్, క్రేజ్ కి హద్దులు లేకుండా పోతుంది. చిత్రబృందం కంటే అభిమానులే RRR మూవీని ప్రమోట్ చేస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు పలుచోట్ల బయట కూడా ఊహించని రీతిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్హం, రాంచరణ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే.. RRR కోసం ఎన్ని చేయాలో అన్నివిధాలా చేసేస్తున్నారు. కార్కాలపై ఎన్టీఆర్ డిజైన్స్ వేయడం,షర్ట్స్, టి-షర్ట్స్ పై ఎన్టీఆర్ పేరు డిజైన్ చేయడం చూసాం. కానీ మరో ముందడుగు వేసి అమెరికాకు చెందిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఓ విమానానికి ‘తొక్కుకుంటూ పోవాలే.. జై ఎన్టీఆర్’ అని బ్యానర్ కట్టి ఆకాశంలో ప్రదర్శించారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.విదేశాలలో ఇప్పటికే RRR అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. ఇక ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల అధారంగా రూపొందిన ఈ ఫిక్షనల్ మూవీ పై అంచనాలు మాత్రం తారాస్థాయిలో నెలకొన్నాయి. డీవీవీ దానయ్య నిర్మించిన RRR మూవీకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని తదితరులు కీలకపాత్రలలో నటించారు. మరి RRR మూవీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Sky is the limit they said… But is it ?? #RRRMassBegins #RRRMovie 🔥🌊
— RRR Movie (@RRRMovie) March 12, 2022