సాధారణంగా స్టార్ హీరోల సినిమాలంటే ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉంటాయి. అదే ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు, పైగా పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్ అనగానే అంచనాలు మరోస్థాయికి చేరుకుంటాయి. కానీ.. ఆ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తుంది దర్శకుడు రాజమౌళి అని తెలిస్తే.. ఆడియెన్స్ అంచనాలు తారాస్థాయిని దాటిపోతుంటాయి. ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో అదే జరిగింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం లైఫ్ స్టోరీస్ ఆధారంగా రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రామ్ చరణ్ అల్లూరిగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. అదేవిధంగా దేశవిదేశాలకు చెందిన సెలబ్రిటీలు, హాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆర్ఆర్ఆర్ ని కొనియాడిన విషయం విదితమే.
ఇక పీరియాడిక్ ఫిక్షన్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్ గా ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేశాడు రాజమౌళి. ఇద్దరు స్టార్ హీరోలు ఉండేసరికి సినిమాలో పోరాట ఘట్టాలు, గ్రాఫిక్స్ అద్భుతాలు జరిగిపోతాయని అంచనాలతో ప్రేక్షకులు థియేటర్లలోకి పరుగులు తీశారు. వారికోసమైనా విజువల్స్ వండర్ గా ఉండాలని.. రాజమౌళి టీమ్ డిజైన్ చేసిన ఫైట్స్.. ముఖ్యంగా హీరోల ఇంట్రడక్షన్స్, ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ వేరే లెవెల్ లో ఆకట్టుకున్నాయి. విజువల్ గా ఎంతో గ్రాండియర్ గా ప్లాన్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఏ సినిమాలో అయినా కాస్తోకూస్తో గ్రాఫిక్స్ వర్క్ అవసరం ఉంటుంది. అందులోనూ పాన్ ఇండియా మల్టీస్టారర్, రాజమౌళి డైరెక్షన్ లో అంటే.. ఇంకా ఏ రేంజిలో గ్రాఫిక్స్ వాడకం ఉంటుందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్నో అద్భుతమైన సన్నివేశాల వెనుక గ్రాఫిక్స్ వర్క్ ఎంతో ఉంది. అయితే.. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వ్యాన్ సీన్ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ సీన్ లో వ్యాన్ టైర్స్ ఉన్నట్లుగా మనం సినిమాలో చూశాం. కానీ.. మేకింగ్ లో వ్యాన్ ఓ ట్రాక్ పై వెళ్లడం గమనించవచ్చు.
ఆ సీన్ లో వ్యాన్ కి తాళ్లు కట్టి గాల్లోకి ఎగరవేయడం కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఈ వ్యాన్ సీన్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ ఇద్దరూ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే తమ తదుపరి సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో రాజమౌళి క్రేజ్ ప్రపంచదేశాలకు పాకిందనే చెప్పాలి. మరి ఆర్ఆర్ఆర్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.