సినీ ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి తన ప్రతి సినిమాతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నాడు. బాహుబలి సిరీస్ తో ప్రపంచానికి తెలుగు సినిమా సత్తాను పరిచయం చేసి.. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా అందుకోని కలెక్షన్స్ రాబట్టాడు. ఇక ఇప్పుడు ఐదేళ్ల తర్వాత మళ్లీ బాక్సాఫీస్ దగ్గర రాజమౌళి తెరకెక్కించిన RRR విజయకేతనం ఎగురుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ట్రిపుల్ ఆర్ మూవీ కలెక్షన్స్ లో విధ్వంసం సృష్టించింది.
బాహుబలి 2 మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన రెస్పాన్స్ తో రూ. 197 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. అయితే.. ఇవి బాహుబలి 2 క్లోసింగ్ కలెక్షన్స్. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఈ రికార్డును ఏ సినిమా బీట్ చేయలేకపోయింది. ఐదేళ్ల తర్వాత అదే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ.. విడుదలైన 10 రోజుల్లోనే రూ. 234 కోట్లు వసూల్ చేసింది. బాహుబలి 2 క్లోజింగ్ కలెక్షన్స్ ని కేవలం పది రోజుల్లో బీట్ చేయడం విశేషం.ఇక్కడ రెండూ కూడా రాజమౌళి సినిమాలే కావడం మరో విశేషం. అయితే.. బాహుబలి 2 సినిమా కలెక్షన్స్ రికార్డును ట్రిపుల్ ఆర్ బీట్ చేయడం అనేది కొత్త విషయంగా చూడట్లేదట ఫ్యాన్స్. ఎందుకంటే.. ఐదేళ్ల కింద బాహుబలి 2 రికార్డు అది.. అన్ని కోట్లు రాబట్టిన మొదటి సినిమా అదే. ఇప్పుడున్న పరిస్థితులు, భారీ రిలీజులు బట్టి ట్రిపుల్ ఆర్.. 10రోజుల్లో 200 కోట్లు క్రాస్ చేయడం సరికొత్త రికార్డు. కానీ రెండూ రాజమౌళి సినిమాలే కాబట్టి కంపేర్ చేయలేం అంటున్నాయి సినీవర్గాలు. మరి RRR రికార్డు కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
బాహుబలి-2 షేర్ కలెక్షన్స్:
ఆంధ్రా – 95.92 Cr
సీడెడ్ – 34.70 Cr
నైజాం – 66.60 Cr
టోటల్(తెలంగాణ/ఏపీ) – 197.22 Cr
RRR.. (10 రోజుల) కలెక్షన్స్:
ఏపీ – 137 Cr
నైజాం – 97 Cr
టోటల్ – 234 Cr