అంబర్‌పేటలో నాలుగు ఏళ్ల బాలుడిపై కుక్కల దాడి ఘటనపై దర్శకుడు ఆర్జీవీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఐదు ప్రశ్నలు వేశారు.
అంబర్‌పేటలో నాలుగు ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీడియా, సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఘటనను ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ సీరియస్‌గా తీసుకున్నారు. బాధిత కుటుంబం కోసం మీడియా వేదికల్లో మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలోనూ ట్వీట్లతో ఆ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం తెలంగాణ ప్రభుత్వానికి ఐదు ప్రశ్నలు వేశారు. వరుస ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లలో ‘‘ పట్ట పగలు హత్యకు గురైన నాలుగేళ్ల ప్రదీప్‌కు సంబంధించి.. ప్రజలందరి తరపునుంచి, భవిష్యత్తులో కుక్కల దాడికి గురికాబోయే వారి తరపునుంచి ప్రభుత్వానికి నా డిమాండ్. వెంటనే ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వండి.
1) ప్రజలు సురక్షితంగా బయట తిరగటానికి మీరు తీసుకుంటున్న తక్షణ చర్యలు ఏంటి?.. ‘దీని గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అన్నది సమాధానం కాదు. ఎందుకంటే.. కుక్కలు ఇప్పుడే దాడి చేసి చంపుతున్నాయి.
2) చిన్నారుల ప్రాణాల కంటే వీధి కుక్కల సంరక్షణ ఎక్కువని మీరు భావిస్తున్నారా? వీధి కుక్కలన్నిటిని పట్టుకుని కుక్కల సంరక్షణాలయాలకు పంపటం సాధ్యం కాదు. అలాగని దత్తత ప్రక్రియ కూడా కుదరదు. ప్రజలు స్వచ్ఛందంగా కుక్కల్ని దత్తత తీసుకోవాలని అడగటం వృధా.
3) రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల కుక్కల్ని పట్టి కుక్కల సంరక్షణాలయాల్లో పెట్టడానికి ప్రభుత్వానికి వనరులు లేకపోతే.. మీరు కుక్కల ప్రేమికులపై పన్నులు విధించి, ఆ డబ్బుల్ని దీనికోసం వాడండి. ఎందుకంటే సాధారణ ప్రజలకు వారిని వారు పోషించుకోవటానికే స్తోమత లేదు.
4) వాటిని పూర్తిగా స్టెరిలైజ్ చేయటం అన్నది చాలా సమయం తీసుకుంటుంది. మేము ఇప్పటి పరిస్థితి గురించి మాట్లాడుతున్నాము. కుక్కలు మనుషుల్ని చంపేస్తున్న ఈ సమయం గురించి?
5) కుక్కల దాడిలో చనిపోయిన 4 ఏళ్ల ప్రదీప్ కుటుంబసభ్యులు ఎంతటి మానసిక క్షోభకు గురయ్యారు. దానికి మీరు ఎంత పరిహారం ఇస్తారు?’’ అని ప్రశ్నించాడు.
ప్రస్తుతం ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఆర్‌జీవీకి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఆర్జీవీ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, అంబర్‌పేటలో నాలుగు ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి ఘటనపై ప్రభుత్వాన్ని ఆర్జీవీ ఐదు ప్రశ్నలు వేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Dear GOVERNMENT
1.
What are the immediate steps you are taking for the people to safely step outside ? We will discuss among us , is not an answer because the dogs are attacking and killing right now #JustifyPradeep https://t.co/HDjpQ5wblf— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2023