టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. టాలీవుడ్ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖపట్నంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. కుందనపు బొమ్మ, సెకండ్ హ్యాండ్, షూటౌట్ ఎట్ ఆలేరు చిత్రాల్లో నటించారు సుధీర్ వర్మ. సినిమాల్లోనే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించారు. చిన్న వయసులో సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకోవడం పట్ల పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కోమాకుల సుధీర్ మృతిని జీర్ణించుకోలేకపోయానంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇదిలా ఉంటే సుధీర్ వర్మ మృతదేహాన్ని విశాఖపట్నంలోని ఎల్జీ హాస్పిటల్ కి తరలించి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు.
సుధీర్ వర్మకు సంబంధించిన డెత్ రిపోర్ట్ లో ఎలా చనిపోయారో అనే విషయాన్ని వైద్యులు వెల్లడించారు. విశాఖపట్నంలోని తెన్నేటి నగర్ లో నివాసం ఉండే సుధీర్ వర్మ.. విషం తాగి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మొదట్లో వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయారనుకున్నారు. అయితే అనారోగ్య సమస్యల వల్లే సుధీర్ చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సుధీర్ వయసు 34 ఏళ్ళు అని, ఇంకా పెళ్లి కూడా కాలేదన్న విషయం డెత్ రిపోర్టు చూస్తే తెలుస్తోంది. అనారోగ్య సమస్యల వల్ల చనిపోయారా? లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? విషం తాగి చనిపోవడానికి కారణాలు ఏమై ఉండచ్చునన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.