బాలీవుడ్ నుండి తెలుగు తెరకు ఎంతో మంది హీరోయిన్స్ పరిచయమయ్యారు. కొంత మంది ఒక్క సినిమా చేసి, ఫేమ్ తెచ్చుకుని మళ్లీ బాలీవుడ్ బాట పడుతుంటారు. ఇంకొంత మంది చాలా సినిమాలు చేసి.. మనమ్మాయే అనిపించుకుంటారు. అటువంటి వారిలో రవీనాటాండన్ ఒకరు.
బాలీవుడ్ నుండి తెలుగు తెరకు ఎంతో మంది హీరోయిన్స్ పరిచయమయ్యారు. కొంత మంది ఒక్క సినిమా చేసి, ఫేమ్ తెచ్చుకుని మళ్లీ బాలీవుడ్ బాట పడుతుంటారు. ఇంకొంత మంది చాలా సినిమాలు చేసి.. మనమ్మాయే అనిపించుకుంటారు. అటువంటి వారిలో రవీనాటాండన్ ఒకరు. బాలీవుడ్ నుండి వచ్చిన ఈ అందం..తెలుగులో నాలుగు సినిమాల్లో నటించింది. తొలుత రధ సారధి అనే సినిమాలో నటించింది. అయితే అందరికీ బాలకృష్ణ, రవిరాజా పినిశెట్టి కాంబోలో వచ్చిన బంగారు బుల్లోడు చిత్రంలో పొగరు బోతు అమ్మాయిగా మెప్పించింది. ఈ సినిమా తర్వాత హిందీ పరిశ్రమకు వెళ్లిపోయి.. టాప్ హీరోయిన్ రేంజ్‌కు చేరింది.
సుమారు ఎనిమిదేళ్ల తర్వాత ఆకాశ వీధిలో సినిమాలో నాగార్జునతో జతకట్టింది ఈ అమ్మడు. ఆ తర్వాత పాండవులు, పాండవులు తుమ్మెదలో నటించింది. ఇక తెలుగులో కనిపించనప్పటికీ.. గత ఏడాది యష్, ప్రశాంత్ నీల్ వర్మ చిత్రం కేజీఎఫ్-2లో రమికా సేన్‌గా నటించింది మనల్ని పలకరించింది. ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. పెళ్లి కాకముందే ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని సంచలనం సృష్టించింది. ఆ తర్వాత నటుడు అక్షయ్ కుమార్‌తో డేటింగ్ చేసిన ఆమె.. అతడిని తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంది. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నాక.. మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సినీ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీని వివాహం చేసుకుంది.
వీరికి ఇద్దరు పిల్లలు రాష, రణబీర్ వర్దన్. అయితే ఇప్పుడు రవీనాటాండన్ పుత్రికోత్సవంలో మునిగి తేలుతుంది. ఆమె కూతురు రాష ఇటీవల ధీరూభాయి అంబానీ స్కూల్ నుండి పట్టా పొందింది. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే ఫోటోలను షేర్ చేసిన ఆమె ప్రౌడ్ మూమెంట్, జీవితాంతం గుర్తిండిపోయే జ్ఞాపకాలు అంటూ పోస్టు చేసింది. ఇక రాష విషయానికి వస్తే.. అందంలో అమ్మను మించిపోయింది. ఆమె నడక తీరు చూస్తే.. సినిమా హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూస్తే ఆ మాట అనకుండా ఉండలేరు. ఈ నేపథ్యంలో ఆమెను సినిమాలోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అజయ్ దేవగన్ మేనల్లుడు, రవీనా కుమార్తె రాష హీరో హీరోయిన్లుగా సినిమా రాబోతున్నట్లు బాలీవుడ్‌లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.