దక్షిణాది సినిమాల్లో.. తన అందం, టాలెంట్‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకుని.. బాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతూ.. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. వివాదాలకు కెరాఫ్ అడ్రెస్‌గా మారింది రష్మిక. ప్రస్తుతం బాలీవుడ్‌లో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తూ.. బిజీగా ఉంది రష్మిక. ఇక ప్రసుత్తం ఆమె తెలుగు, తమిళ్‌లో తలపతి విజయ్ సరసన నటించిన వారసుడు.. సంక్రాతి పండుగకు విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు.. నెట్టింట దుమ్మురేపుతున్నాయి. మరీ ముఖ్యంగా రంజితమే పాట.. సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే. ఇక తాజాగా ఈ పాటకు రష్మిక స్టేజీ మీద డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలువతోంది. ఆవివరాలు..
విజయ్-రష్మిక జంటగా.. వారసుడు చిత్రం తెరకెక్కుతుంది. తమిళ్‌లో వారిసు పేరుతో రిలీజ్ కానుంది. కొన్ని రోజుల క్రితమే.. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు. ఇక నూతన సంవత్సరం సందర్భంగా.. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఫుటేజీని చిత్రబృందం విడుదల చేసింది. దీనిలో విజయ్.. మాట్లాడుతూ.. సినిమా కోసం పని చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాక.. సినిమాలో తనతో పాటు నటించిన ఆయా నటీనటులతో.. తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ఆ తర్వాత.. దిల్ రాజు, వంశీ పైడిపల్లికి కృతజ్ఞతలు చెప్పారు. ఇక రష్మిక గురించి మాట్లాడుతూ.. తన మంచి నటి అని.. తెరపైనా.. బయట కూడా ఒకేలా ఉంటుందని ప్రశంసిస్తూ.. ఆమెకు దిష్టి తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
ఇక ఈవేడుక సందర్భంగా.. కొరియోగ్రాఫర్ జానీతో కలిసి.. రష్మిక.. రంజితమే పాటకు స్టేజీ మీద డ్యాన్స్ చేసింది. ఇది చూసి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. అనంతరం రష్మిక మాట్లాడుతూ.. ‘‘గిల్లి సినిమా చూసి.. నేను విజయ్‌కు వీరాభిమానిని అయ్యాను. నేను మీలాగే.. ఈలలు, గోల చేస్తూ.. ఆయన సినిమాలు చూస్తాను. విజయ్‌తో నటించాలని నాకల. ఇన్నాళ్టికి అది నెరవేరింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంతసేపు.. నేను ఆయనను ఇబ్బంది పెట్టేదాన్ని. సెట్‌లో ఉన్నంతసేపు ఆయననే చూస్తూ.. నవ్వుతూ ఉండేదాన్ని. విజయ్ సార్.. మీతో మరో సినిమా చేసినా సరే.. మిమ్మల్ని అలానే చూస్తూ ఉంటాను.. ఐ లైక్ యూ సర్’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలువతున్నాయి.