ఈరోజు సోషల్ మీడియాలో ఇన్ స్టా రీల్స్ నుండి ట్విట్టర్ ట్రెండ్స్ దాకా.. నార్త్ టు సౌత్ జనాలందరినీ తెగ ఉర్రూతలూగిస్తున్న బిగ్గెస్ట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసా. అదే.. నితీష్ తివారీ సెట్స్ పైన విజువల్ మ్యాజిక్ లా మారుస్తున్న ‘రామాయణ’ మూవీ! మన సాయి పల్లవి నటన, రణ్‌బీర్ కపూర్ చామ్, యష్ అరాచకమైన స్క్రీన్ ప్రెజెన్స్.. ఈ ముగ్గురి కాంబోలో రాబోతున్న ఈ సినిమా థియేటర్లలో ఏ రేంజ్ లో పూనకాలు తెప్పిస్తుందో ప్రత్యేకంగా చెప్పాలా?”
అందరూ తెగ క్యూరియాసిటీతో అడుగుతున్న మెయిన్ క్వశ్చన్.. ‘ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది?’ అని. బాస్.. క్యాలెండర్ తీసి ఆ డేట్‌ని గట్టిగా రౌండప్ చేసుకోండి! 2026 నవంబర్ 6న ఈ అద్భుతం మన ముందుకు రాబోతోంది. ఆ దీపావళికి ఫ్యాన్స్ అందరికీ అంతకు మించిన పండగ ట్రీట్ మరొకటి ఉండదు,

భాషల విషయానికి వస్తే మాత్రం మైండ్ పోవాల్సిందే బాస్! ఎందుకంటే ఇది మన నార్త్, సౌత్ సినిమాల బోర్డర్స్ దాటేసింది. మన దేశీ భాషలతో పాటు ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇంగ్లీష్, జపనీస్, మాండరిన్ అంటూ వరల్డ్ వైడ్ గా దాదాపు 40 పైగా భాషల జనాలను పలకరించబోతోంది. గ్లోబల్ వైడ్‌గా 50,000 కంటే ఎక్కువ స్క్రీన్స్ అంటే మామూలు విషయం కాదు బాస్! ప్రపంచ సినిమా హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వేట అవ్వబోతోంది!”
ఇక అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మెయిన్ మ్యాటర్.. గ్రాఫిక్స్ మ్యాజిక్! 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్.. ‘అవతార్’, ‘డ్యూన్’ సినిమాలకు ఏమాత్రం తీసిపోవట! ‘గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో ఏంటో’ అని మొదట్లో పెదవి విరిచిన బాలీవుడ్ ఆడియన్స్, లేటెస్ట్ విజువల్ గ్లింప్స్ చూశాక ఫిదా అయిపోయారు. ‘ఇంటర్స్టెల్లార్’ లాంటి సినిమాల్లో వాడే గ్లోబల్ లెవెల్ 86 కెమెరాల టెక్నాలజీతో దీన్ని విజువలైజ్ చేస్తున్నారు. దాంతో సినిమాపై అంచనాలు స్కై హైకి చేరిపోయాయి!”
శ్రీరాముడిగా రణ్‌బీర్ ప్రశాంతతను, సీతమ్మగా సాయి పల్లవి సహజత్వాన్ని, రావణాసురుడిగా యష్ చూపించే ఆ పవర్‌ఫుల్ రౌద్రాన్ని.. లార్జర్ ద్యాన్ లైఫ్ IMAX 3D స్క్రీన్ పై చూసి తరించడానికి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు.
