టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల జంట ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ కి ఇటీవలే మెగాస్టార్ గుడ్ న్యూస్ చెప్పి ఆనందపరిచారు. అవును.. త్వరలోనే రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. దాదాపు పెళ్ళైన పదేళ్లకు ఈ జంట నుండి మెగా న్యూస్ బయటికి వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా ఆ వార్త విన్నప్పటి నుండి సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ.. విష్ చేస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్, ఉపాసన జంటపై సరోగసి రూమర్స్ తెరపైకి వచ్చాయి.
ఉపాసన కూడా నయనతార బాటలో సరోగసీ మార్గాన్ని ఎంచుకుందని కథనాలు వినిపించాయి. కానీ, తాజాగా ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ.. చరణ్ – ఉపాసన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవల ఫ్యామిలీ పార్టీ ఉండటంతో చరణ్, ఉపాసన థాయిలాండ్ వెళ్లారు. అక్కడ సెలబ్రేషన్స్ కి సంబంధించి ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఉపాసన బేబీ బంప్ తో కనిపిస్తుండటం విశేషం. దీంతో ఉపాసన సరోగసీ అంటూ వార్తలకు స్ట్రాంగ్ కౌంటర్ పడినట్లయింది. ఇక బేబీ బంప్ పిక్స్ లో ఉపాసనను చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా.. త్వరలో జూనియర్ రామ్ చరణ్ రాబోతున్నాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. 2012లో రామ్ చరణ్ – ఉపాసన పెళ్లి చేసుకున్నారు. అప్పటినుండి ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ.. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ వస్తున్నారు. ఓవైపు ఉపాసన మెగా కోడలిగా ఫ్యామిలీని చూసుకుంటూనే.. అపోలో హాస్పిటల్స్ మేనేజ్ మెంట్స్, సామాజిక సేవా కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొంటూ వస్తున్నారు. మరోవైపు సినీ రామ్ చరణ్.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. అలాగే ఇటీవల ట్రూ లెజెండ్ అవార్డు అందుకొని మెగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చాడు. సో.. 2022 మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యాన్స్ కి మర్చిపోలేని మెమోరీస్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. మరి చరణ్ – ఉపాసన జంటపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.
#RamCharan #Upasana pic.twitter.com/rvbkAc0ZAJ
— Hardin (@hardintessa143) December 19, 2022