హీరోలు, హీరోయిన్లకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ తో టచ్‌లో ఉండేందుకు వారికి సంబంధించిన విషయాలను, ఫొటోలు, రీల్స్ పోస్ట్ చేస్తుంటారు. అయితే అందులో భాగంగా ఒక్కోసారి వారి చిన్ననాటి జ్ఞాపకాలను కూడా పంచుకుంటూ ఉంటారు. అలా షేర్ చేసిన ఒక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో ఉన్న ఇద్దరు చిన్నారులు ఎవరు? అని కొందరు తెగ వెతికేస్తున్నారు. కాస్త పోలికలు ఉన్నప్పటికీ కొందరు మాత్రం వారిని గుర్తుపట్టలేక పోతున్నారు.
ఆ ఫొటోలు ఒక పిల్లాడిన మరో పిల్లాడు ఎత్తుకుని ఉన్నాడు. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఆ ఇద్దరూ ఇప్పుటు టాలీవుడ్ లో స్టార్ హీరోలు కాడ. ఇద్దరూ వరుస సినిమాలు, కమర్షియల్స్ అంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక చిన్నారిది ఈరోజు(జనవరి 19)న పుట్టినరోజు కూడా జరుపుకుంటున్నాడు. అతని పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలుపుతూనే ఓ స్టార్ హీరో ఈ పిక్ ని షేర్ చేశాడు. అయితే వాళ్లిద్దరూ మరెవరో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ ఓల్డ్ పిక్ షేర్ చేసుకున్నాడు.
పుట్టిన రోజు సందర్భంగా వరుణ్ తేజ్ తర్వాతి సినిమాపై బిగ్ అప్డేట్ వచ్చింది. టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. వరుణ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి గాండీవధారి అర్జున అని టైటిల్ ఫిక్స్ చేశారు. వరుణ్ తేజ్ కెరీర్లో ఇది 12వ సినిమా. దీనిని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అని ఫస్ట్ లుక్ చూడగానే అర్థమైపోతుంది. ఈ సినిమాలో వరుణ్ పాత్ర మీద మాత్రం క్లారిటీ రాలేదు. వరుణ్ మాత్రం ఈ సినిమా పోస్టర్ రివీల్ చేస్తూ ‘శాంతి భద్రతలను కాపాడటం అంత తేలిక కాదు’ అనే కోణంలో కొటేషన్ రాసుకొచ్చాడు.
Happiest birthday @IAmVarunTej !
Wishing you the best of health and success ❤️ pic.twitter.com/aMI4php3ae— Ram Charan (@AlwaysRamCharan) January 19, 2023
ఈ సినిమాలో వరుణ్ కచ్చితంగా చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడని చెప్పొచ్చు. వరుణ్ తేజ్ ని ఎంతో స్టైలిష్ గా చూపిస్తూనే.. ఎంతో డెడ్లీ అని చెప్పకనే చెబుతున్నారు. వరుణ్ ఈ మూవీలో ఒక స్పై గానీ, ఏదైనా ఏజెంట్ కావొచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు. కానీ, ప్రవీణ్ సత్తారు మాత్రం ఇది స్ప్రై థ్రిల్లర్ కాదంటూ కొట్టిపారేశాడు. ఈ మూవీలో వరుణ్ తేజ్ మెసేజ్ ఇస్తారంటూ చెబుతున్నారు. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ స్వరాలు అందిస్తున్నాడు. వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కి బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Keeping peace is a bloody business!🔥#GandeevadhariArjuna@PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial pic.twitter.com/HQQxaZ65oV
— Varun Tej Konidela (@IAmVarunTej) January 19, 2023
#GandeevadhariArjuna pic.twitter.com/L2p4g5FttS
— Varun Tej Konidela (@IAmVarunTej) January 19, 2023