హీరోలు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నా.. కొన్నిసార్లు షూటింగ్స్ లేకుండా ఉండాల్సిన సమయం వస్తుంది. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అలాంటి గ్యాప్ నే తీసుకోబోతున్నాడట.
ఇండస్ట్రీలో హీరోలు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నా.. కొన్నిసార్లు షూటింగ్స్ లేకుండా ఉండాల్సిన సమయం వస్తుంది. అది వారు కావాలని బ్రేక్ తీసుకోవడం వల్ల వచ్చే గ్యాప్ కాదు.. దానికి వేరే కారణాలైనా ఉండవచ్చు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అలాంటి గ్యాప్ నే తీసుకోబోతున్నాడట. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్.. తదుపరి సినిమాగా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘RC15’ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇప్పుడైతే షెడ్యూల్స్ వారీగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ క్రమంలో రామ్ చరణ్ తో సినిమా చేస్తూనే దర్శకుడు శంకర్.. విశ్వనటుడు కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2’ తీస్తున్నాడు. అంటే.. ఒకేసారి రెండు పడవలను షెడ్యూల్స్ వారీగా మేనేజ్ చేస్తూ వస్తున్నాడు శంకర్. మొన్నటిదాకా చరణ్ తో హైదరాబాద్ లో బిగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన శంకర్.. ఇప్పుడు కమల్ తో ఇండియన్ 2 బిగ్ షెడ్యూల్ పూర్తి చేయనున్నాడు. అదికూడా ఏకంగా నెల రోజులు జరుపనున్నట్లు తెలుస్తోంది. దీంతో అనుకోకుండానే రామ్ చరణ్ కి నెల రోజులపాటు గ్యాప్ వచ్చేసిందని అంటున్నాయి సినీ వర్గాలు. మరి ఈ గ్యాప్ లో చరణ్ ఏం చేయనున్నాడు? అనే విషయంపై కొన్ని కారణాలైతే వినిపిస్తున్నాయి.
ఎలాగో నెల రోజుల తర్వాతే శంకర్ తో షూటింగ్ తిరిగి స్టార్ట్ అవుతుంది. కాబట్టి.. ఈ సమయాన్ని కొన్ని ముఖ్యమైన విషయాలకోసం కేటాయించనున్నాడట చరణ్. అవును.. తాజా సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. సో.. సతీమణి ఉపాసనతో విలువైన టైమ్ ని గడపవచ్చు. అంతేగాక ఆస్కార్ వేడుకలు కూడా దగ్గరలో ఉన్నాయి కదా! వాటికి హాజరై రావచ్చు. ఇవన్నీ కాదని అనుకుంటే.. తదుపరి సినిమా బుచ్చిబాబుతో చేయనున్నాడు. కనుక, బుచ్చిబాబుతో కథా చర్చలు కూడా జరిపే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. మరి వీటిలో ఏం చేస్తాడనేది ఎవరికీ తెలియదు. కానీ.. చరణ్ – శంకర్ సినిమాపై అంచనాలు మాత్రం పీక్స్ లో ఉన్నాయి. చూడాలి మెగా పవర్ స్టార్, శంకర్ కాంబోలో ఎలాంటి సినిమా రెడీ అవుతుందో!
Back on the sets of #Indian2 pic.twitter.com/B3ByCedXHc
— Shankar Shanmugham (@shankarshanmugh) February 16, 2023