ప్రేమ, పెళ్లిపై దేశ దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి షాకింగ్ కామెంట్లు చేశారు. రమతో తనది ఆకర్షణ అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దేశం గర్వించ దగ్గ చిత్ర దర్శకుల్లో ఎస్‌ఎస్ రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. ఆయన తన సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు.. దేశం మొత్తానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. సినిమా కెరీర్ ప్రారంభంనుంచి ఇప్పటి వరకు ఒక్క ఫెయిల్యూర్ లేని చిత్ర దర్శకుడిగా రాజమౌళికి పేరుంది. ఆయన ఇన్ని విజయాలు సాధించటంలో తన భార్య రమా రాజమౌళి పాత్ర కూడా ఉందని చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చారు. తన సినిమాల విషయంలో ఆమె కృషి చాలా ఉంటుందని అన్నారు. గతంలో ఓ వేదికపై రాజమౌళి మాట్లాడుతూ.. భార్య రమతో ప్రేమ, పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘1992 నుంచి నేను డైరెక్టర్ అవుదామని అనుకుంటున్నాను. అప్పటినుంచి నాకు కాన్ఫిడెన్స్ పోయింది. కానీ, మధ్యలో ఓ 8 నెలలనుంచి సంవత్సరం వరకు ఆ కాన్ఫిడెన్స్ పోయింది. డైరెక్టర్‌గా మనం పైకి రాకపోతే ఎలాగా?.. ఏదైనా ఉద్యోగం చూసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. ఎందుకో తెలుసా? లవ్‌లో పడ్డాను. ఆ ముందు తర్వాత నాకు ఎప్పడూ ఆ భయం లేదు. ప్రేమంటే భయం కాదు.. బాధ్యత. సినిమా అనేది నిలకడ లేనిది. ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలీదు. వస్తుందనుకుని వెళ్లిపోతూ ఉంటాం. ఎప్పుడు వస్తుందో తెలీదు.
పెళ్లి, పెటాకులు అనుకుంటే ఆ రెండిటికీ చుక్కెదురు కదా.. నేను ప్రేమ అంటున్నాను కానీ, అది నిజానికి ప్రేమ కాదు. అదొక ఆకర్షణ. ఓ అమ్మాయితో కలిగిన ఆకర్షణ మాత్రమే.. ఆ టైంలో. మా మధ్య గొడవలు రాకుండా మొదటి నుంచి చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశాను. సినిమా విషయంలో నా పక్కన ఉండి సపోర్ట్ చేయాలని చెప్పాను. నేను ఫస్ట్ ఏదైనా మా ఆవిడతో చెప్పేస్తాను. సమస్య లేదు. మీకింకా తెలీదు. అది కాకుండా వేరే లవ్ మ్యాటర్‌ను.. మా ఆవిడను పంపించి క్యాన్సిల్ చేశాను’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.