సీనియర్ నటి రాధా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్లపాటు సౌత్ ఇండియాని ఊపేసింది. అయితే.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రాధా.. తన ఇద్దరు కూతుర్లను ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా పరిచయం చేసింది. రాధా పెద్ద కూతురు కార్తీక. 2009లో అక్కినేని నాగచైతన్య సరసన 'జోష్' సినిమాతో డెబ్యూ చేసింది. జోష్ సినిమా నిరాశపరచడంతో.. తర్వాత తమిళ, కన్నడ, మలయాళం భాషలలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినా కెరీర్ లో ఎక్కువగా ప్లాప్స్ పడటంతో అవకాశాలు తగ్గిపోయి.. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.
సీనియర్ నటి రాధా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్లపాటు సౌత్ ఇండియాని ఊపేసింది. అయితే.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రాధా.. తన ఇద్దరు కూతుర్లను ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా పరిచయం చేసింది. రాధా పెద్ద కూతురు కార్తీక. 2009లో అక్కినేని నాగచైతన్య సరసన ‘జోష్’ సినిమాతో డెబ్యూ చేసింది. అప్పటికీ కార్తీక వయసు 16 ఏళ్ళు. జోష్ సినిమా నిరాశపరచడంతో.. రెండేళ్లు గ్యాప్ తీసుకొని తమిళంలో ‘కో'(రంగం) మూవీ చేసింది. కార్తీకకి ఆ సినిమా ఫస్ట్ సక్సెస్ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు క్యూ కట్టినప్పటికీ.. అమ్మడు సరైన కథలు ఎంచుకోకపోవడంతో చేసిన సినిమాలన్నీ పెద్దగా పేరు తీసుకురాలేదు.
ఆ విధంగా కార్తీకకి హిట్స్ లేక ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయి.. గ్రాఫ్ అంతా పడిపోయింది. చేసేదేం లేక సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్, నెటిజన్స్ ని మెప్పించే ప్రయత్నం చేసింది.. అయినా పెద్దగా క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. ప్రస్తుతం కార్తీక వయసు 30 ఏళ్ళు. హీరోయిన్ గా ఎలాగో సక్సెస్ కాలేదు.. కాబట్టి, బిజినెస్ వైపు అడుగులేసి విజయవంతంగా కెరీర్ లీడ్ చేస్తోందని తెలుస్తోంది. 2015లో సినిమాలు చేయడం ఆపేసిన కార్తీక.. అప్పటినుండి ‘ఉదయ్ సముద్ర గ్రూప్’ సంస్థలో ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ గా తన ప్రతిభ చాటుకుంటోంది. ఇన్నాళ్లు కంపెనీ గ్రోత్ లో కీలకపాత్ర పోషించిన కార్తీక.. తాజాగా అరుదైన గౌరవం అందుకుంది. సినిమాలలో రాణించలేకపోయినా.. బిజినెస్ రంగంలో కార్తీక పేరు గట్టిగానే వినిపిస్తోంది.
దుబాయ్ లో ఉంటూ ఉదయ్ సముద్ర గ్రూప్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ గా విశేషమైన కృషి చేసినందుకుగాను.. కార్తీకని యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాతో సత్కరించింది. దుబాయ్ లోని టూఫోర్ 54 ప్రధాన కార్యాలయంలో యూఏఈకి చెందిన హమద్ అల్మన్సూరి కార్తీకకు గోల్డెన్ వీసాను అందజేశారు. ఈ సందర్భంగా కార్తీక మాట్లాడుతూ.. యంగ్ విమెన్ ఎంట్రప్రెన్యూవర్ గా తనకు గుర్తించి, సత్కరించినందుకు యూఏఈకి కృతజ్ఞతలు చెప్పింది. ఇదిలా ఉండగా.. కార్తీక కాకుండా రాధా చిన్నకూతురు తులసి కూడా సినిమాల్లో హీరోయిన్ గా ట్రై చేసింది. కడలి, యాన్ సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. అప్పటినుండి ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. సినిమాలు మానేసి రాధా కూతురు కార్తీక ఏం చేస్తోంది..? అనేవారికి బిజినెస్ విమెన్ గా జవాబు చెబుతోంది. హీరోయిన్స్ సినిమాలలో ఫెయిల్ అయి.. బిజినెస్ లో రాణించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.