సీనియర్ నటి రాధా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్లపాటు సౌత్ ఇండియాని ఊపేసింది. అయితే.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రాధా.. తన ఇద్దరు కూతుర్లను ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా పరిచయం చేసింది. రాధా పెద్ద కూతురు కార్తీక. 2009లో అక్కినేని నాగచైతన్య సరసన 'జోష్' సినిమాతో డెబ్యూ చేసింది. జోష్ సినిమా నిరాశపరచడంతో.. తర్వాత తమిళ, కన్నడ, మలయాళం భాషలలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినా కెరీర్ లో ఎక్కువగా ప్లాప్స్ పడటంతో అవకాశాలు తగ్గిపోయి.. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) గోల్డెన్ వీసాను అల్లు అర్జున్ కు దుబాయ్ ప్రభుత్వం జారీ చేసింది. ఈ వీసాను పొందిన తొలి టాలీవుడ్ నటుడిగా ఆయన నిలిచారు. తనకు గోల్డెన్ వీసా జారీ చేసిన విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్న ఆయన..దుబాయ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ‘గోల్డెన్ వీసా అందించి.. మరోసారి అద్భుతమైన అనుభూతిని అందించినందుకు దుబాయ్ కి ధన్యవాదాలు. త్వరలో మళ్లీ […]
దుబాయ్- మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ గురించి కొత్తాగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వాళ్లిద్దరు మలయాళ సినీ పరిశ్రమకు రెండు కళ్లలాంటివారు. అంతే కాదు మోహన్ లాల్, మమ్ముట్టి ఇద్దరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. వారిద్దరు చాలా తెలుగు సినిమాల్లో నటించడమే కాదు, మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన మలయాళ సినిమాలెన్నో తెలుగులోకి డబ్ అయి విజయం సాధించాయి. అందుకే ఈ సూపర్ స్టార్స్ ఇద్దరికి తెలుగులో చాలా మంది అభిమానులున్నారు. ఇక అసలు విషయానికి […]