RGV Dangerous Movie: ఆర్టీజీ తన కొత్త సినిమా ‘‘ డేంజరస్’’ ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. దేశం అటునుంచి ఇటువరకు హీరోయిన్లతో ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ దూసుకుపోతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో విడుదలకు సిద్ధం చేశారు. ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దేశంలో మొదటి లెస్బియాన్ క్రైం,డ్రామా అయిన ఈ సినిమాకు పెద్ద థియేటర్లు షాక్ ఇచ్చాయి. లెస్బియాన్‌ల మీద వస్తున్న సినిమా కాబట్టి తమ థియేటర్లలో సినిమాను వేసుకోమని పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ తేల్చి చెప్పేశాయి.
దీనిపై ఆర్జీవీ ఆవేదన వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ డేంజరస్ ‘‘లెస్బియాన్ థీమ్‌పై వస్తున్న సినిమా కాబట్టి పీవీఆర్, ఐనాక్స్ సినిమా హాల్లు సినిమాను వేసుకోమని అంటున్నాయి. అది కూడా సెన్సార్ బోర్టు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత.. సుప్రీం కోర్టు సెక్షన్ 377ను రద్దు చేసిన తర్వాత. దీన్ని బట్టి చూస్తే సదరు యాజమాన్యం ఎల్జీబీటీ కమ్యూనిటీకి వ్యతిరేకమని అర్థమవుతోంది’’ అని పేర్కొన్నారు. ఆర్జీవీ ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
. @_PVRcinemas , @INOXCINEMAS refusing to screen my film KHATRA (DANGEROUS) becos it’s theme is LESBIAN ,and this after Supreme Court repealed section 377 and censor board already passed .it is a clear cut ANTI stand of their managements against #LGBT community pic.twitter.com/GxoHDH7Tjw
— Ram Gopal Varma (@RGVzoomin) April 5, 2022
ఇవి కూడా చదవండి : Jr.ఎన్టీఆర్- రామ్ చరణ్ క్రేజ్ గురించి హాలీవుడ్ హీరో మాటల్లో
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.