ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన మూడో సినిమా ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ‘పుష్ప ది రైజ్’ పేరుతో పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 17న రిలీజయ్యింది. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించాయి.
నిజానికి పుష్ప టీజర్, ట్రైలర్లు సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి. దీంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. గత శుక్రవారం విడుదలైన పుష్ప సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. విడుదలైన ఫస్ట్ డే నుండి 6వ రోజు వరకు పుష్ప మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. మొత్తానికి 6 రోజుల వరకు ‘పుష్ప’ అన్ని వెర్షన్ లు కలిపి రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇంకా పుష్ప బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.146 కోట్ల షేర్. 6 రోజులు పూర్తయ్యేసరికి పుష్ప అన్ని భాషలు కలిపి రూ.102.10 కోట్ల షేర్ వసూల్ చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ కు రూ.43.9 కోట్ల షేర్ రాబట్టల్సి ఉంది. క్రిస్మస్ సెలవులకు పబ్లిక్ పుష్ప పై లుక్కేస్తే మాత్రం పుష్ప బ్రేక్ ఈవెన్ పక్కా అంటున్నాయి సినీవర్గాలు.