రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కించారు. గత నెల 16న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైంది. సినిమా తొలి ఆట నుండే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది.
పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల ఆది పురుష్‌తో మన ముందుకు వచ్చారు. బాలీవుడ్ ఫిల్మ్ తాన్హాజీ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించారు. రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. గత నెల 16న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైంది. సినిమా తొలి ఆట నుండే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. పూర్ విఎఫ్ఎక్స్‌తో పాటు డైలాగ్స్, ఏ మాత్రం ఆసక్తికరంగా లేని స్క్రీన్ ప్లేతో బాక్సాఫీసు ముందు చతికిల పడింది. డైలాగ్స్ మార్చినప్పటికీ.. జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. అయితే ఇందులో రాముడిగా డార్లింగ్ ప్రభాస్ నటించారు. కేవలం అతడి మేనియా కారణంగా సినిమా బ్రేక్ ఇవెన్ పాయింట్‌కు చేరుకుంది.
ఈ సినిమాలో రాముడి పాత్రలో నటన పరంగా ప్రభాస్ పర్వాలేదు అనిపించుకున్నా.. విమర్శలు అయితే ఆగలేదు. పాత కాలం నాటి రామాయణాన్ని, ఈ సినిమాతో పోల్చి మాట్లాడుతున్నారు. ఆదిపురుష్‌తో ఆరడుగుల కటౌట్.. తన డై హార్ట్ ఫ్యాన్సును కూడా నిరాశ పర్చారు. రాముడికి మీసాలు ఉంటాయా అన్న దగ్గర నుండి.. అరణ్యావాసానికి వెళ్లే ముందు కనిపించే సీన్లలో డార్లింగ్‌ను చూసి దర్శకుడు ఓం రౌత్‌ను తిట్టని వారుండరు. అయితే ఆయన తదుపరి ప్రాజెక్టులు సలార్, ప్రాజెక్టు-కె సినిమాలపై తమ ఆశలను పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే..
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న మూవీ ప్రాజెక్టు-కె. మహా నటితో పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో స్టార్ కాస్టింగ్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే. అమితాబ్, దీపికా, దిశా పటానీ, కమల్ హాసన్ వంటి నటీనటులు పనిచేస్తున్నారు. అయితే అందిన సమాచారం మేరకు ఈ సినిమాలో ప్రభాస్.. విష్ణు మూర్తి అవతారమని తెలుస్తోంది. ఇందులో కే అంటే కల్కి అని అర్ధమట. కల్కి అంటే వెంకటేశ్వర స్వామి.. విష్ణు మూర్తి మరో రూపం ఆయన. ఆయనే భూమి మీదకు వచ్చి.. అడ్వాన్స్ వెపన్స్‌తో దుర్మార్గుల ఆట కట్టిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూనే ఆందోళన చెందుతున్నారు. రాముడిగా ప్రభాస్‌ను చూడలేని చాలా మంది ఇప్పుడు విష్ణు అవతారమనే సరికి ఇదేమీ ట్విస్ట్ అంటూ మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. ఆ మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.