ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్ ఎట్టకేలకు వచ్చేసింది. నిజంగా ఫస్ట్ గ్లింప్స్ మామూలుగా లేదు. ఫస్ట్ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది.
బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ కి ఆ రేంజ్ సాలిడ్ హిట్ పడలేదు. సాహో, రాధేశ్యామ్, రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ సినిమాలు నిరాశపరిచాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రాజెక్ట్ కే, సలార్ సినిమాల మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలే సలార్ టీజర్ తో ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చిన ప్రభాస్.. ఈసారి ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్ తో అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అసలు మామూలుగా లేదు భయ్యా ఫస్ట్ గ్లింప్స్. చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇదసలు తెలుగు సినిమాయేనా? లేక హాలీవుడ్ సినిమానా? అన్నంత ఆశ్చర్యం వేస్తుంది. ప్రభాస్ ఫస్ట్ లుక్ చూసి మొదట్లో కంగారుపడ్డారు గానీ ఇప్పుడు ఈ ఫస్ట్ గ్లింప్స్ చూస్తుంటే అబ్బా సాయిరాం అని రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోవచ్చు. అంత అద్భుతంగా ఉంది ఫస్ట్ గ్లింప్స్.
ప్రాజెక్ట్ కే అంటే ఏంటో అర్థం చెప్పండిరా, సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నామని వచ్చిన మీమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఫ్యాన్స్ కూడా ఆ ప్రాజెక్ట్ కే అర్ధమేంటో తెలుసుకోవాలని ఆరాటపడ్డారు. ఎట్టకేలకు దాని అర్ధమేంటో మేకర్స్ చెప్పేశారు. ప్రాజెక్ట్ కే.. కే ఫర్ కల్కి. కల్కి 2898 ఏడీ అంటూ ఫస్ట్ గ్లింప్స్ ని వదిలారు. చూస్తుంటే టైం ట్రావెల్ కథలా అనిపిస్తుంది. 2898వ సంవత్సరానికి చెందిన కథా నేపథ్యంలో కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. ఇందులో ప్రభాస్ కల్కిగా కనిపించనున్నారు. కల్కి అవతారంలో సమస్త భూమండలాన్ని కాపాడే భగవంతుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచం ఎప్పుడైతే అంధకారం చేత పాలించబడుతుందో అప్పుడు ఒక శక్తి పెరుగుతుంది. కల్కి అవతారం అంటే ఇంక అది సృష్టి అంతమని అంటారు. ఆ అంతానికి ప్రాజెక్ట్ కే కల్కి 2898 ఏడీ ఆరంభం అని దర్శకుడు చెప్పారు.
ప్రభాస్ క్యారెక్టరైజేషన్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. ఇప్పటి వరకూ ఎవరూ చూపించని రేంజ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ డార్లింగ్ ని చూపిస్తున్నారు. ఆ విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఎక్కడా కూడా ఇదసలు తెలుగు సినిమా అని అనిపించదు. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్, ఆ సినిమాటోగ్రఫీ, క్యారెక్టరైజేషన్స్ అన్నీ ఇచ్చి పడేసిండు. సినిమా అయితే అంచనాలను మించి ఉంది. ఈ రేంజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా మాత్రం రికార్డులు తిరగరాయడం పక్కా అనిపిస్తుంది. మన భారతీయతను, భారతీయ విలువలను, సనాతన ధర్మం తాలూకు అంశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు కల్కిగా ప్రభాస్ రాబోతున్నారు. ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టి సంచలన విజయాన్ని నమోదు చేయాలని కోరుకుందాం. మరి మీ అభిప్రాయమేంటి డార్లింగ్స్.. ఫస్ట్ గ్లింప్స్ ఎలా అనిపించింది?