ఏపీలో మూవీ టికెట్స్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. అయితే జగన్ సర్కార్ నిర్ణయంపై సినీ ప్రముఖులు స్పందిస్తూ ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారం, బెనిఫిట్ షోలపై తమ వాదనను వినిపిస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం మరోసారి ఆలోచించాలంటూ విజ్ణప్తి చేశారు.
అయితే తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సైతం స్పందిస్తూ జగన్ సర్కార్ తీరుపై కాస్త ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం మరోసారి ఆలోచించుకోవాలని, ఇలాగే గనుక వ్యవహరిస్తే కనీసం కరెంట్ ఛార్జీలు కూడా రావని, పూర్తిగా సినిమా థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని అన్నారు. ఇక చిన్న సినిమాలతో పెద్ద సినిమాలను పోల్చరాదని ఈ రెండు సినిమాలకు ఒకే టిక్కెట్ ధరను నిర్ణయించడం కూడా కరెక్ట్ కాదని సురేష్ బాబు అన్నారు. చిన్న సినిమాలతో పోలిస్తే పెద్ద సినిమాల బడ్జెట్ భారీగా ఉంటుందని అన్ని సినిమాలకు ఒకే టిక్కెట్ నిర్ణయంతో పెద్ద నిర్మాతలు పూర్తిగా నష్టపోతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాజాగా సురష్ బాబు చేసిన ఈ కామెంట్స్ కాస్త చర్చనీయాంశమవుతోంది.