బుల్లితెరపై ప్రేక్షకాదరణ పొందిన ప్రోగ్రామ్స్ లో జబర్ధస్త్ కామెడీ షో ఒకటి. జబర్ధస్త్ తో తమదైన స్కిట్స్ తో అలరించిన నటులు ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చాటుతున్నారు. ఇక ‘జబర్దస్త్’ షోల్లో ఎంతమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ అందులో పంచ్ ప్రసాద్ స్టైలే వేరు.. తనదైన కామెడీ టైమింగ్, పంచ్ లతో బాగా అలరించేవారు.
తెలుగు బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు వచ్చాయి.. కానీ ‘జబర్ధస్త్’కామెడీ షో వచ్చిన క్రేజ్ దేనికీ రాలేదని అంటారు. జబర్ధస్త్ లో వచ్చే స్కిట్స్ చూస్తూ ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా పాపులర్ అయిన కమెడీయన్లు ఇప్పుడు వెండితెరపై రాణిస్తున్నారు. ఇక జబర్ధస్త్ ఆర్టిస్ట్ లు ఎప్పటికప్పుడు కొత్త స్కిట్స్ తో కామెడీ టైమింగ్, పంచ్ లతో కోట్ల మంది అభిమానులను అలరిస్తుంటారు. జబర్ధస్త్ లో ఎంతమంది కమెడియన్లు ఉన్నా అందులో పంచ్ ప్రసాద్ స్టైలే వేరు. తనదైన పంచులు వేస్తూ అందరినీ ఎంటర్ టైన్ చేసే ఇతడి జీవితంలో చాలా కష్టాలున్నాయి. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో భాదపడుతున్న పంచ్ ప్రసాద్ పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని మరో జబర్ధస్త్ నటుడు నూకరాజు ఓ వీడియో షేర్ చేశాడు.
జబర్ధస్త్ కామడీ షోలో ప్రేక్షకులను తనదైన కామెడీ టైమింగ్, పంచ్ లతో కడుపుబ్బా నవ్వించాడు. ఈ ప్రోగ్రామ్ లో కూడా తనదైన పంచ్ లతో ప్రేక్షకులను అలరించారు. పంచ్ ప్రసాద్ కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆయన పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించినట్లు.. ఇందుకు లక్షల్లో ఖర్చు అవుతుందని.. పెద్ద మనసు చేసుకొని సహాయం చేయాలంటూ నూకరాజు ఓ వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో గడిచిన మూడేళ్లుగా ప్రసాద్ అన్న కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు.. ఆయనకు డయాలసీస్, ఇతర చికిత్సలు చేసినా ఆరోగ్యం మాత్రం కుదుట పడలేదు. అంతేకాదు ఆయన థయిరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. అర్జంట్ గా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయకుండా పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉందని వైద్యులు తెలిపారని నూకరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
పంచ్ ప్రసాద్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది లక్షలతో కూడుకున్న వ్యవహారం.. మాకు సాధ్యమైనంత సహాయం చేస్తున్నాం.. ఈ సమయంలో దాతలు ముందుకు వచ్చి ఆయనకు సహాయం చేసి ప్రాణాలు రక్షించాలని కోరుతున్నాం.. దయచేసి అన్న ప్రాణాలు కాపాడటానికి మీ వంతు సహాయం చేయగలరని ప్రార్థిస్తున్నాం.. అంటూ బ్యాంక్, ఫోన్ పే డిటేల్స్ వీడియోలో షేర్ చేశారు. పంచ్ ప్రసాద్ అన్న కి చాలా సీరియస్ గా వుంది. కిడ్నీ మార్పిడి చేయాలి దానికి చాలా కర్చు అవుతుంది. మా వంతుగా మేము సహాయం చేస్తున్నాం. ఇంకా ఎవరయినా హెల్ప్ చెయ్యాలి అనుకుంటే కిందవున్న నెంబర్ కి ఫోన్ పే చెయ్యండి అంటూ హైపర్ ఆది సోషల్ మాద్యమం ద్వారా తెలిపారు. ఎంతో విషాదంలో ఉన్నా.. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా పంచ్ ప్రసాద్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లో పాల్గొంటూ తనదైన కామెడీ పంచుతూ.. పంచులు వేస్తూ అందరినీ అలరించారు.
ఈ సందర్బంగా పంచ్ ప్రసాద్ సతీమణి సునీత ప్రసాద్ తన భర్త పరిస్తితి పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన భర్త ఆరోగ్య పరిస్థితి బాగాలేదని.. డాక్టర్లు వెంటనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సిందిగా చెప్పారని.. అందుకు లక్షల్లో డబ్బు ఖర్చు అవుతుందని.. దయచేసి పెద్ద మనసు చేసుకొని తన భర్త ప్రాణాలు కాపాడాలని.. ఇప్పటి వరకు ఎంతోమంది పెద్ద మనసు చేసుకొని సహాయం చేయడానికి ముందుకు వస్తున్నవారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాతలు స్పందిస్తూ తమకు తోచిన సహాయం చేస్తున్నారు.