బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కళాకారులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వెండితెరపై స్టార్ కమెడియన్స్ గా తమ సత్తా చాటుతున్నారు.
తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలు వచ్చినా‘జబర్ధస్త్’కామెడీ షో ఎంత పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇందులో నటించిన నటుల ఇప్పుడు బుల్లితెర, వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. బుల్లితెరపై జబర్ధస్త్ షో కి వచ్చిన ఆదరణ చూసి ఇతర ఛానల్స్ వాళ్లు అలాంటి ప్రోగ్రామ్స్ ప్రారంభించినా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. బజర్ధస్త్ ఆర్టిస్ట్ లు తమ కామెడీ టైమింగ్, పంచ్ లతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి వారిలో పంచ్ ప్రసాద్ ఒకరు. తనదైన కామెడీ టైమింగ్, పంచ్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడ్డ పంచ్ ప్రసాద్ పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
బుల్లితెరపై ‘జబర్ధస్త్’ కి ఎంత గొప్ప క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ వేదిక నుంచి ఎంతోమంది నటులు వెండితెరపై స్టార్ కమెడియన్లు గా రాణిస్తున్నారు. జబర్ధస్త్ లో కామెడీ టైమింగ్, పంచ్ లతో అలరించిన వారిలో పంచ్ ప్రసాద్ ఒకరు. స్కిట్ లో పంచ్ ప్రసాద్ తనదైనా పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. బుల్లితెరపై ఎందరికో నవ్వులు పంచినా ఆయన మాత్రం కష్టాలు.. కన్నీళ్లతో ముందుకుసాగుతున్నారు. పంచ్ ప్రసాద్ గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పలువురు దాతలు ముందుకు వచ్చి ఆయనకు సహాయం అందించారు. రెగ్యూలర్ గా ఆయనకు డయాలసీస్ చేయించుకున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని జబర్ధస్త్ నటుడు కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
జబర్ధస్త్ లో కెరీర్ ప్రారంభించిన ఎంతోమంది నటులు ప్రేక్షకుల దీవెనల వల్ల మంచి స్థాయికి ఎదిగారు. ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు.. ఒక్కొక్కరూ తమదైన స్టైల్లో నవ్వించి ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేశారు. ప్రస్తుతం తమ సహనటుడు పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. ఆయకు వెంటనే ఆపరేషన్ చేయాలని.. అందుకు చాలా ఖర్చు అవుతుందని, దాతలు పెద్ద మనసు చేసుకొని సహాయం చేయాలని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓ వీడియో రిలీజ్ చేశారు.
నూకరాజు మాట్లాడుతూ.. ‘ఎన్నో ఆస్పత్రులు తిరిగినా ప్రసాద్ అన్న ఆరోగ్యంలో పురోగతి రాలేదు.. మూడు సంవత్సరాల క్రితమే రెండు కిడ్నీలు ఫెయిల్ కాగా అప్పటి నుంచి ఆయన బాధను భరిస్తూనే ఉన్నారు. వెంటనే ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ఫ్లాంటేషన్ చేయించాలని డాక్టర్లు తెలిపారు. లేదంటా ఆయనకు ఏం జరుగుతుందో చెప్పలేం అన్నారు.. ఆపరేషన్ కి లక్షల్లో ఖర్చు అవుతుంది.. దయచేసి మీకు తోచినంత సహాయం చేయండి ప్లీజ్’ అంటూ ఆర్థిక సహాయం కోసం ఆర్ధించారు. బ్యాంక్, ఫోన్ పే స్కానర్ డిటేల్స్ ఇందులో పొందుపరిచారు. కాగా, ఈ వీడియోలో పంచ్ ప్రసాద్ ఆక్సీజన్ మాస్క్ ధరించి ఉన్నారు.