టిక్ టాక్ వీడియోస్ తో ఎంతో పాపులారిటీ సంపాదించుకొని ఎప్పటికప్పుడు తన వీడియోస్ తో యూత్ లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రణవి మనుకొండ. ప్రణవి మనుకొండ తో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్ని సినిమాల్లో, చిన్నప్పటి హీరో గా నటించిన సాత్విక్ వర్మ స్నేహితుల దినోత్సవం సందర్భంగా సుమన్ టీవీ కి ఒక ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
అందులో తాము 10 సంవత్సరాల నుండి ఫ్రెండ్స్ గా ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాం అని చెప్పారు. అలాగే ప్రణవి కి ఏదైనా సమస్య వస్తే తానే దాన్ని పరిష్కరించుకుంటుందని, ఆ తర్వాతే తనకి చెప్తుందని సాత్విక్ అన్నాడు, ఇలా ఎంతో సరదాగా సాగిపోయే వారి ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఇంటర్వ్యూ సుమన్ టీవీ లో చూడండి.
ప్రణవి ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 4 టాప్ 5 ఫైనలిస్ట్ మెహబూబ్ షార్ట్ ఫిలిం లో హీరోయిన్ గా చేస్తుంది. అలాగే సాత్విక్ బాహుబలి లో చిన్నపాటి ప్రభాస్ గా మనం చూసాం.